170 రామాయణ విశేషములు గృహస్థులకు భార్య మగనియొక్క ఆత్మయే. "నహి తావ దతిక్రాంతా సుకరా కాచన క్రియా” (అయో. 50-97) ఏ కార్యమైనా చెడినపిమ్మట సవరింప నలవికాదు. "న పరేణాళితం భక్ష్యం వ్యాఘ్రః ఖాదితు మిచ్ఛతి” అయో. 61_18 ఇతర జంతువులు తిన్న మాంసమును వ్యాఘ్రము ముట్టదు. “గతి రేకా పతి ర్నార్యా ద్వితీయాగతి రాత్మజః తృతీయా జ్ఞాతయో రాజం శ్చతుర్థీ నేహ విద్యతే" ఇది "పితా రక్షతి కౌమారే” వంటిది. (అయో. 61-24) “జోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శ్రుతం శోకో నాశయతే సర్వం, నాస్తి శోకసమో రిపు : " " (అయో. 62-15) “పూర్వాపకారిణాం త్యాగే న హ్యధర్మో విధీయతే" (అయో. 96-24) ముందుగా అపకారము చేసినవారిని శిక్షించుటలో అధర్మము లేదు. ఇది లక్ష్మణుని నీతి. సత్యము యొక్క ప్రాముఖ్యమును తెలుసుకొనుటకై అయోధ్యా కాండ 109 సర్గలో 10 నుండి 22 శ్లోకములను చదువవలెను. "యద్వృత్తా స్సంతి రాజాన సద్వృత్తా స్సంతిహి ప్రజాః" ఇది యథా రాజా తథా ప్రజా వంటిది. (1903. 109-9) “పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః" (అర. 1-18)
పుట:రామాయణ విశేషములు.pdf/220
ఈ పుటను అచ్చుదిద్దలేదు