పుట:రామాయణ విశేషములు.pdf/219

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 188 మె తనగువానినే లోకులు అవమానము చేయుచుందురు. ( మెత్త నగుచోటనే గుద్దలి వాడియౌకదా-చేమకూర-సారంగధర.) “ధర్మోహి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం” (అయో. 21-40) “విక్లబో వీర్యహీనో య స్సదైవ మనువర్తతే నీరా స్సంభావితాత్మానో న దైవం పర్యుపాసతే” (ఆయో. 28-16) ఇది లక్ష్మణుని నీతి. అతడు హిందువుల కవసరమగు నీతిని బోధించుచున్నాడు. ఈ సర్గలో దైవము బలీయమా, పురుషకారము బలీయమా అను చర్చచేసినాడు. “చేతకానివారు నా కర్మ మిట్లుంది అని ఏడురు. బుద్ధిమంతులైన వీరులు దైవమును లెక్క పెట్టక పురుష ప్రయత్నము తప్పక చేసితీరుదురు” అని వాదించినాడు. (ఈ చర్చకై అయోధ్యకాండ 22, 23 సర్గలను పూర్తిగా చదువవలెను.) బిడ్డలకు. "బుద్ధియుక్తాహి పురుషా న సహంతే పరస్తవం" (ఆయో. 26-25) బుద్ధిమంతులు ఇతరులు తమ్ము స్తుతించిన సహింపరు. “నహి నింబాత్ స్రవేత్ క్షాద్రం" వేపనుండి తేనె కారదు. (అయో. 35-15) "పితౄస్ సమనుజాయంతే నరాః మాతర మంగనాః” (అయో. 25-26) తండ్రి పోలిక కొడుకులకు, తల్లి పోలిక "ఆత్మాహి దారా స్సర్వేషాం దారసంగ్రహ వర్తినాం” (405 37-24)