168 రామాయణ విశేషములు సగర చక్రవర్తి యొక్క ధార్మికపాలనమును గురించి యొక యంశము రామాయణమందు ఒకే శ్లోకమందు సూచింపబడినది. సగరుని పెద్దకుమారుడు, అతని యనంతరము చక్రవర్తి కావలసినవాడు, యౌవనమందు పిల్లవాండ్రను సరయూనదిలో వేసి ముంచి వారి బాధల కానందించుచుండెను. ఈ వార్త సగరునికి తెలియగా తన పుత్రుని తన రాజ్యమునుండి నిర్వాసితునిగా జేసెను. రామాయణమందు నీతివాక్యములుగా జ్ఞాపక ముంచుకొనదగిన వాక్యములు చాలా కలవు. కొన్నిటిని మాత్రమే యిందు ఉదాహరించు చున్నాను. 'అనిషిద్ధ సుఖత్యాగీ పశురేవ న సంశయః' (బాల.4) శాస్త్ర నిషిద్ధములుకాని సుఖములను వదలుకొనువాడు పశువే. పరప్రవాసే హి వదంత్యను తమం తపోధనా స్సత్యవచో హితం నృణాం. (అయో. 11-20) సత్యమే మనుష్యులకు స్వర్గలోకప్రాప్తి హేతువని ఋషులు చెప్పినారు. 'యదాయదాహి కౌసల్యా దాసీవచ్చ సఖీ వచ భార్యావ దృగినీవచ్చ మాతృవచ్చోపతిష్ఠతి” దశరథుడు కౌసల్యా ప్రాశస్త్యము నిట్లు నిరూపించెను: 'ఆమె నాకు దాసివలె, సఖివలె, భార్యవలె, చెల్లెలివలె, తల్లివలె వర్తించుకొనుచున్నది.' అయో. (12-68) "సత్యం హి పరమం ధర్మం" (అయో. 14-8) "సత్య మేకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్ఠితః సత్యమేవాక్షయావేదా సత్యే నైవాప్యతే పరం.” (అయో. 14-7) “మృదుర్హి పరిభూయతే” (అయో. 21-11`
పుట:రామాయణ విశేషములు.pdf/218
ఈ పుటను అచ్చుదిద్దలేదు