రామాయణ విశేషములు 161 వలెను. భృత్యులకు సైనికులకు సకాలములో జీతముల నియ్యవలెను. చారులద్వారా 18 విధములగు అధికారవర్గమును అనగా పురోహితులు, సేనాపతి, కోశాధిపతి, నగరాధ్యక్షులు, దండపాలురు, దుర్గపాలురు, ధర్మాధికారులు, కర్మాంతికులు మున్నగువారు తమతమ కార్యములను చక్కగా నిర్వర్తించుచున్నారా లేదా యని విచారించుకొనుచుండవలెను. గ్రామములవృద్ధి, తటాకాది నిర్మాణములచే సస్యవృద్ధి, పశుసంపద, చోరభయరాహిత్యము కలుగునట్లుగా రాజు పాలింపవలెను. ప్రతిదినము ఉదయముననే రాజు ప్రజలకు దర్శన మియ్యవలెను. సైన్యమున కవసరమగు ఏనుగులను, గుఱ్ఱములను సమకూర్చుకొనవలెను. కోటలలో ధనధాన్యములను ఆయుధములను యంత్రములను ఉంచవలెను. యము ఎక్కువగా నుండినను వ్యయము మాత్రము స్వల్పముగా చేయ వలెను. న్యాయమును నిష్పక్షపాతముతో భాగ్యవంతులకును దరిద్రుల కును ఒకేవిధముగా ప్రసాదించవలెను.. ఆదా “ఏరాజు ప్రజలవద్ద ఆరవభాగము పన్ను తీసుకొని వారిని తన కుమారులవలె రక్షించడో అతడు అధికమైన అధర్మము చేసిన వాడగును.” (ఆర. 6–11) అని మునులు రామునికి బోధించిరి. శూర్పణఖ రావణుని చెల్లెలు. స్వైరకామిని. తత్ఫలితముగా ముక్కు చెవులను బోగొట్టుకొనెను. స్వార్థముతోనైనను సరే, మరే కారణముతోనైనను సరే, శూర్పణఖ రావణుని నిందించెను. రాజధర్మము సరిగా నిర్వర్తించలేదని కఠినముగా పలికెను. ఆమె చెప్పిన రాజనీతి అది రాక్షసులదే యైనను ఉత్తమ రాజనీతియై యున్నది. ఆమె రావణునితో ఇట్లనెను: “నీవు గ్రామ్యస్వైర కామభోగము లందు ప్రమత్తుడవై నిరంకుశుడవై యున్నావు. ఇట్టి రాజును ప్రజలు శ్మశాన మును చూచినట్లుగా చూచి దూరముగా తొలగిపోదురు. స్వయముగా RV-11
పుట:రామాయణ విశేషములు.pdf/211
ఈ పుటను అచ్చుదిద్దలేదు