పుట:రామాయణ విశేషములు.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

xix


మరియు అధర్వసంహిత 13 కాండ 1 సూక్తములో కొన్ని సూత్రములు నరుడు చేయరాని కర్మలఁ జెప్పును. ఆ మంత్రములే పెక్కులు శ్లోకరూపముగా, అయోధ్యకాండ 75 సర్గయందు భరతుఁడు కౌసల్యకడఁ జేయు ప్రమాణములలోఁ గాన్పించును. జైన బౌద్ధమతాంశము లెట్లు శ్రీమద్రామాయణమునఁ జేరినవో శ్రీ రెడ్డిగారు వివరించియే యున్నారు.

రెడ్డిగారు వానరరాక్షస తత్వములు, నాటి సాంఘికాచారములు మొదలగు వానిని జక్కఁగా విమర్శించుచు రామాదుల మాంస, గోమాంస, మధుపర్క భక్షణములానాఁడు కలవనియు, నవి యానాఁడు విరుద్ధములు గావనియు వ్రాసిరి. నాకుఁజూడనన్ని స్మృతులలో శ్రాద్ధాది క్రియలలో మాంసభక్షణము విహితముగానె గాన్పించినది. మాంసభక్షణమునకుఁ బ్రాయశ్చిత్తము చెప్పిన స్మృతిగాని “ఉల్లిపాయ” (లశున) భక్షణమునకుఁ బ్రాయశ్చితము చెప్పని స్మృతిగాని కాన్పింపలేదు. మాంసము లేనిదే మధుపర్కము కాదనినాడు తన గృహ్యసూత్రమున, ఆశ్వలాయనమహర్షి (నా మాంసోమధుపర్కః). "పంచనఖాభక్ష్యాః" అనినాడు, పతంజలిమహర్షి. "ధేన్వనడుహోర్భక్షం- మేధ్యమానడుహమితవాజస నేయకం” అన్నాడాప స్తంబమహర్షి, తన ధర్మసూత్రమున. శ్రీరాముడు గోమధుపర్కముఁ గొనుట యాశ్చర్యముకాదు. శ్రీ కృష్ణమూర్తి గోపాలుడు సంధికై హస్తిపురి కేగినపుడు దుర్యోధనుఁడు తన యింట భుజింపుమనగా భుజింపనని నిరాకరించెనేగాని ధృతరాష్ట్రు మందిరమున కేఁగినవెంటనే ధృతరాష్ట్రుడు నగరిపురోహితులచే నిప్పించిన గోమధుపర్కము నాప్యాయనముగా నాస్వాదించెను ఇవి ప్రాచీనకథలు. ఇప్పటి కాఱువందలయేండ్లకుఁ బూర్వమువఱకు సకృత్తుగా మత్స్యమాంస భక్షణము మన యాంధ్ర బ్రాహ్మణులలో నున్నదేమోయని శ్రీ మాధవాచార్యులవారు తన పరాశరమాధవీయములో నిత్యనైమిత్తికములలో మత్స్య మాంసభక్షణముఁ గూర్చి చర్చించి చర్చించి తుదకు “యథావిధి