7 రాజనీతి రామాయణమందు రెండు విధములగు నీతులు గలవు. సాధారణ నీతి, రాజనీతి హితోపదేశము చేయునట్టి నీతియే కాక, రాజులు రాజ్యాం గము నడుపుటలో ప్రత్యేకముగా నడుచు కొనవలసిన పద్ధతియు ఇందు పలుతావుల తెలుపబడియున్నది. మొదట రాజనీతిని గురించి తెలిపి తర్వాత ధర్మ నీతులను గురించి కొంత సూచింతును. పూర్వము నుండియు హిందువులలో రాజును గౌరవించు పద్ధతి యుండెను. రాజుకు విష్ణ్వంశ కలదని హిందువులు విశ్వసించిరి. అయితే అది అంధవిశ్వాసము కాదు. హిందూరాజనీతిలో రాజు నిరంకుశుడగుటకు వీలులేదు అతడు ప్రజాభిప్రాయమునకు వశవర్తుడై యుండవలెను. అతడు ధర్మమును సక్రమముగా పరిపాలించవలెను. అతడు దుష్టుడైనచో ప్రజలు అతనిని తొలగించుచుండిరి. బుద్ధుని కాలానికి పూర్వమందే భారతదేశములో వైరాజ్యములు (Republics) వెలసియుండెను. ఈ సంగతులను దష్టియందుంచుకొని రామాయణ కాలమందలి రాజనీతి యెట్టిదో కనుగొందము. హిందూరాజులు తాము పాలించిన రాజ్యములోని జనులు నీతి పరులై యుండిరని చెప్పుకొనుటలో గర్వించుచుండిరి. దశరథుని పరిపా లనములో ప్రజలెట్లు సుఖులై నీతిపరులై యుండిరో వాల్మీకి ఈ క్రింది విధముగా వర్ణించినాడు. తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః నరాస్తుష్టా ధనైః స్వైః స్వై రాలుః సత్యవాదినః
పుట:రామాయణ విశేషములు.pdf/205
ఈ పుటను అచ్చుదిద్దలేదు