154 రామాయణ విశేషములు రమ ఇప్పటికే ఏర్పడిపోయినది. అందుచేత దానిని వదలినాను. ఆభి లాషులు అత్రి భరద్వాజాగస్త్య మహర్షుల సంబంధమగు భాగములను చదివిన విశదమగును. ఆర్యావర్తమేది? అను విషయము చర్చనీయ మగుచున్నది. “వాల్మీకి భూగోళము” అను ప్రకరణమును వేరుగా వ్రాయుచున్నాను. అందీచర్చ చేయుదును. అతి ప్రాచీనకాలములో అనగా ఋగ్వేద కాలములో ఆర్యావర్తము ఇప్పటి భారతదేశ మనబడు భూభాగమందే లేకుండెనని నా కనుమానము కలుగుచున్నది రామాయణ కాలమువరకు అయోధ్యయే ఆర్యావర్తానికి తూర్పుహద్దనియు, గంగయే దక్షిణపు హద్దనియు నేనభిప్రాయపడు చున్నాను. ఈ విషయములో సనాతన పండితులు వివాదపడుదురని నే నెరుగుదును. అయినను నాకు తోచిన అభిప్రాయమును ముందు వెల్లడింతును. రాముని కాలములో ఆర్యులు తమ సంస్కృతిని గంగకు దక్షిణభాగమందు వ్యాపింపజేయు నుద్దేశ ముతో భరద్వాజుడు, అత్రి, అగస్త్యుడు మున్నగు ఋషులు దక్షిణభాగ మందు అందందు ఆశ్రమములను స్థాపించుకొని ఆర్యమత సంస్కృతు లను వ్యాపింపజేయు నభిమానము కలవారై యుండినట్లు కానవచ్చు చున్నది రాక్షసులచేత ఆవరింపబడిన జనస్థానములో ప్రాణములకు తెగించి అంతటి పట్టుదలతో అపాయస్థితిలో ఆశ్రమజీవనమును ఈ మునులు గడుపవలసిన వేరే అవసరము కానరాదు. ఆర్యుల వలసకు (Colonisation) వీరు నాందీభూతులై యుండిరి. దక్షిణా పథమందు ఆదేపనిగా దుష్టులను శిక్షించి నిర్మూలించుటకై అగస్త్యుడు వెళ్ళెనని రామాయణమందు స్పష్టముగా తెలిపినారు. నిర్జితా జీవలోకస్య తపసా భావితాత్మనా అగ స్త్యేన దురాధర్ష్యా మునినా దక్షిణేవ దీక్-(యుద్ధ 118-14) ఈ విధముగా రామాయణ కాలమందు సాంఘికాద్యాచార వ్యవహా రములు వర్తించుచుండెనని తెలుసుకొనగలుగుచున్నాము. ఇంతదూరము వ్రాసి ఇదంతయు సంగ్రహ విషయమే అని చెప్పవలసియున్నది. సూక్ష్మమముగా తరచుకొలది ఇంకను అనేకాంశములు పరిశోధకుల దృష్టికి వచ్చుచుండును.
పుట:రామాయణ విశేషములు.pdf/204
ఈ పుటను అచ్చుదిద్దలేదు