పుట:రామాయణ విశేషములు.pdf/201

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 151 ఋగ్వేదమంత్ర ద్రష్ట యయ్యెను. దస్యులు అనువారే దహ్యులు. వారు హిందూకుష్ పర్వత పశ్చిమవాసులు. ఫార్సీలో సకారము హకార మగుటచేత దస్య-దహ్య శబ్దములు రెండునొక్కడే! అటైతే శూద్రశబ్దము ఋగ్వేదములో లేదాయనిన కలదు. ఒకే చోట కలదు అది పదవ మండలమున పురుషసూక్తమున కలదు. అంత పెద్ద ఋగ్వేదములో అందును తుదిలో, అందును ఒకేఒక్క మారే శూద్రశబ్దము కనబడుటయేల? అది తర్వాత చేర్చబడిన సూక్తమనవలెనా? నాలుగు వర్ణాలకు జన్మప్రాధాన్యము కలిగిన తర్వాత ఋగ్వేదములో ప్రవేశింపబడియుండునా? అను సందేహము విమర్శకులకు కలిగినది. ఏ. నందీగారు ఇండియన్ ఎక్నాలజీలో ఇట్లు వ్రాసినారు “పురుష సూక్తము తర్వాతికాలములో దూర్చబడినది" (interpolation).యూరోపు ఖండ వేదవిమర్శకు లందరును నీ విషయమున నేకాభిప్రాయులు. కారణ మేమనగా ఋగ్వేదములోని భాషతో నీ సూక్తభాష భిన్నించినది. “దీని స్వరూపములో, శబ్దజాలములో ఇది ఆర్వాచీనమైనది ఇందు పూర్తిగా యజ్ఞవిధాన వర్ణనమున్నది. ఇందు వేదాంత పారిభాషిక పదాలున్నవి. ఇందు వసంత గీష్మ శరదృతువులు ముందువరుసగా వర్ణితములు. నాలుగు వర్ణాల ముచ్చటకలు దిదొక్కటే యొక్కటి. దీని యర్వాచీ నత్వము దీని భాషయే పట్టించును. నిదాఘమును తెలుపు గ్రీష్మ పదము ఋగ్వేదమందెందును ప్రయుక్తము కాలేదు. వసంత పదము వేదకవుల కలవాటైన పదముకాదు. ఋగ్వేదములో ఆది మరొక్కమారే, అదియు పదవమండలములోనే (184_4) వచ్చినది" అని మోక్షమూలుడు నిర్ణ యించెను. గ్రేస్ గారును ఇట్లేయన్నారు: “నాలుగు వర్ణములు మంత్రాలు చాలా ఇటీవలివే. ఈ మంత్రాలభాష అవైదికము. ఇవే పురాణములోనై న నుండిన నందివి బాగుగా అతికిపోయెడివి. మరియు సందర్భరహితముగా