రామాయణ విశేషములు 147 ఈ శ్లోకాలకు వ్యాఖ్య వ్రాసినవారు ఇవి సాముద్రిక ప్రతిపాదిత లక్షణములనియు 'జగద్వల్లభ' అను పుస్తకములో సాముద్రిక శాస్త్ర మున్నదనియు తెలిపినారు. ఈ జగద్వల్లభ యెట్టిదో తెలియదు. అదే వ్యాఖ్యలో వరరుచికూడ ఒక సాముద్రిక శాస్త్రమును రచి చినట్లు తెలిపి నారు. ఈ రెండు గ్రంథము లిపుడు కానరానట్లే! సంస్కృతములో మూడు సాముద్రిక గ్రంథాలు ముద్రితమైనవి. అవి పనికిరాని గ్రంథాలే! మనదేశమందిప్పుడు నిజమైన సాముద్రిక శాస్త్రవేత్తలు కానరారు. వాల్మీకికాలమునాటికే ఆర్యహిందువులలో వైద్యవిద్య మంచి పరిణతి పొందియుండెను. ఓషధీ ప్రభావమును మన పూర్వికులు బాగుగా గుర్తించిరి. చికిత్సలలో ఓషధులను వాడుటలో హిందువులే మొట్ట మొదటివా రని మరల చెప్పవలసియున్నది. హిమవత్పర్వత ప్రాంత మంతయు ఓషధులకు జన్మస్థానముగా మనవారు భావించియుండిరి. నేటికిని ఆ విశ్వాసమందు లోపమేమియు గలుగలేదు. విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి, సంజీవకరణి అను నాలుగు విధాల ఔషధ ములను మనవా రెరిగియుండిరి. (యుద్ధ. 102_22, 28) అయితే ఇందు సంజీవకరణినివా రెరిగియుండిరనుట సంశయాస్పదమే. హిందువులలో కొందరు అట్టి యౌషధమందు విశ్వాసము కలిగియుండిరి. క్రీ.శ. 649లో నారాయణస్వామి యను దాక్షిణాత్య హిందువును చీనాచక్రవర్తి పిలిపించి అతనిచే మృత్యుంజయ రసాయనమును చేయించెను. కాని ఆ చక్రవర్తి క్రీ.శ. 649 లోనే చనిపోయెను. తర్వాతి చక్రవర్తియగు కోత్సంగ్ అనువాడుకూడా ఈ విశ్వాసమునకు లోనై నారాయణస్వామిచే సిద్ధాషధ మును చేయించెను. ఈతడవ నారాయణస్వామియే చనిపోయెను. అక్కడి కిని చీనా చక్రవర్తికి సంజీవకరణియందు విశ్వాసము తగ్గలేదు. లోకా దిత్యుడు అను మరొక హిందువును పిలిపించెను. గరుడ పురాణములో
పుట:రామాయణ విశేషములు.pdf/197
ఈ పుటను అచ్చుదిద్దలేదు