148 రామాయణ విశేషములు యుండిరి. అయో. 29-9. జ్యోతిర్వేత్తలగు బ్రాహ్మణులేకాక తాపస వేషములతో దేశసంచారముచేయు స్త్రీలు కూడా యీ శాస్త్రమందు ప్రావీణ్య అయో. 29_13 . వీ రెవ్వరు? వీరే జిప్సీల మును సంపాదించిరి. . ఆను (Gipsy) పూర్వికులై యుందురు. జిప్సీల భాషలోని పదాలు అధిక భాగము సంస్కృత సమములై యున్నవనియు, వారు తమ భాషను రోమనీ భాష యని యందురనియు అనగా రామ యజమాని పదమునుండి ఏర్పడినదనియు జార్జి బరోగారు వ్రాసినారు . రామాయణ కాలమందు స్త్రీపురుష సాముద్రిక శాస్త్రములు వేరువేరుగా ఏర్పడినట్లు కానవచ్చుచున్నవి వాల్మీకి పురుష సాముద్రిక లక్షణాలను కొన్నింటిని వివరించినాడు. 1 ఎంత సంగ్రహముగా ఈ చర్చలను చేయదలచినను విషయము పెరిగిపోవుచున్నందున ఈ లక్షణాలు ఉదాహరింప వీలులేక పోయినది అభిలాషులు సుందరకాండము సర్గ 35 లోని 17 నుండి 21 వరకుండు శ్లోకాలను వాటిపై వ్యాఖ్యాతలు వ్రాసిన విపుల వ్యాఖ్యాన మును చూచుకొనగలరు. వాల్మీకి స్త్రీ సాముద్రిక లక్షణాలను గూడా ప్రత్యేకముగా వ్రాసియున్నాడు. అభిలాషులు యుద్ధకాండ సర్గ 48 లో 1 నుండి 15 వరకుండు శ్లోకాలను వాటిపై వ్యాఖ్యాతల వివరణను చదువుకొనగలరు. రామాయణ ప్రారంభమందే రాముని సాముద్రిక లక్షణముల నిట్లు వర్ణించినారు: “రాముడు విపులాంసుడు. మహాబాహువులు కలవాడు. కంబుగ్రీవుడు. మహాహనువు కలవాడు.” 'మహోరస్కో మహేష్వా సోగూఢజత్రురరిందమః ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః . (బాల. 1-9, 10, 11.) ‡ Romano Lavo-lil by George Borrow. PP 3 to 8.
పుట:రామాయణ విశేషములు.pdf/196
ఈ పుటను అచ్చుదిద్దలేదు