పుట:రామాయణ విశేషములు.pdf/194

ఈ పుటను అచ్చుదిద్దలేదు

144 రామాయణ విశేషములు దానికి సంబంధించిన శాస్త్రము జీవనాధారముగా కల్పించుకొన్న కొందరి చేతులలో ఒక రహస్య గోప్యశాస్త్రమైపోయెను. కీరో (Cheiro) అను సుప్రసిద్ధ పాశ్చాత్య సాముద్రికవేత్త తన గ్రంథాలలో "నేనీ శాస్త్రమును హిందువులవద్ద నేర్చుకొంటిని” అని వ్రాసినాడు. వారీ శాస్త్రమును గురించి యిట్లభిప్రాయ మిచ్చినారు. “అతి ప్రాచీన కాలములో శబ్దసృష్టి ఆర్య జాతి మూలముననే కలిగినది......విషువత్తులు 25,600 ఏండ్ల కొకమారు కలుగునని సరిగా ప్రాచీన కాలమందే ఈ హిందువులు తెలిపిరి. ఇట్టి ప్రజ్ఞాబలముకల జాతీయే సాముద్రికమును కనిపెట్టెను. ఇప్పుడు మనము ఏ జాతులనైతే చాలా ప్రాచీనమైనవి అంటున్నామో అట్టి జాతులలో నాగరి కత ఏర్పడుటకు ఎంతో కాలానికి ముందుగానే హిందువులీ శాస్త్రాలను సృష్టించిరి. అనగా పర్ష్య, ఈజిప్టు దేశాల పేరులు కూడా తెలియరాని కాలానికంటే చాలా పూర్వమే యహూదీల పెద్ద తాత ఆబ్రహాం పుట్టకముందే, మూసా ( మోసెస్ ) ప్రవక్తకు దశ నిబంధనలు (Ten Commandments) ప్రసాదితము కాక పూర్వమే యీ శాస్త్రాలు వ్రాయబడెను. హిందువులనుండి యీ సాముద్రికము చీనా, తిబ్బెట్, పర్ష్య, ఈజిప్టు, గ్రీసు దేశాలలో వ్యాపించెను. క్రీ. పూ. 440 లో అనక్ష గోరస్ అను గ్రీకు పండితుడు తన శిష్యుల కీ శాస్త్రమును నేర్పు చుండెను.”+ † In the far off dawn of Civilization, the first evidence of a word language belongs to the Aryan race. To their descendants, the Hindus, we owe the discovery of the precesion of the equinoxes which takes place every 25,600 years and we, with all the marvellous scientific instruments at our disposal, have only in recent years proved their calculations to be correct.