పుట:రామాయణ విశేషములు.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

xvii


రామాయణమునకు ప్రస్తుతరూపము కాళిదాసునకుఁ బూర్వము (క్రీ. శ. 4 శతాబ్దము) గోతమీపుత్ర శాతకర్ణికిఁ బిమ్మటను ( క్రీ. శ. 2 శతాబ్ది) గల ప్రాకృత వ్యాకరణకర్తయగు (వాల్మీకి) కూర్చియుండెనా యని తలచుచున్నాను. కారణమేమనగా, క్రీ. శ. రెండవ శతాబ్దమునకుఁ గాని మన యీ దేశమునకు 'ఆంధ్ర' సంజ్ఞ కలుగలేదు. కిష్కింధాకాండలో నాంధ్రదేశ ప్రశంస కలదు. రాముఁడరణ్యావాస మొనర్చిన పంచవట్యాదు లిప్పటి యాంధ్రదేశాంతర్గతములు. అవి నాఁడు ఘోరా రణ్యయుతములు. ఆంధ్రదేశ సంజ్ఞ రామునినాఁ డెట్లుండును? కాన నా భాగము రెండవ వాల్మీకి కల్పితమె. ఇట్లే ఉత్తరకాండతో హనుమంతుని వ్యాకరణ జ్ఞానప్రశంసలో నాతఁడు 'పాణినిసూత్రములు వరరుచి వార్తికము, పతంజలి భాష్యము' కూడ చదివినట్లు క్రింది శ్లోకముచే సూచింపబడెను.


శ్లో॥ ససూత్రవృత్యర్థ పదంమహార్థం। ససంగ్రహంసాధ్యతి
     వైకపీంద్రః|| - 49 ఉత్తరకాండ. 36 స.

పై శ్లోకమునకు మహేశ్వర తీర్థీయవ్యాఖ్య యిట్లు కలదు: “సూత్రం, అష్టాధ్యాయీ లక్షణం, వృత్తిః (కాశికావృత్తిః) తాత్కాలిక సూత్రవృత్తిః ఆర్థపదం సూత్రార్థబోధక పదవద్వారికం, మహార్థం, మహాభాష్యం పతంజలికృతం, సంగ్రహం వ్యాడికృత సంగ్రహాఖ్య గ్రంథసహితం”.

ఇట్లు క్రీ. పూ. 2వ శతాబ్దమునందలి పతంజలి భాష్యమును గోతమీపుత్ర శాతకర్ణి నిర్మితమగు నాంధ్రదేశమున స్మరింపబడిన రామాయణములోని కిష్కింధోత్తర కాండాంశములు నవీనములు. కాని కాళిదాసు మహాకవి తన రఘువంశ మహాకావ్యమున రామాయణోత్తరకాండలోని