పుట:రామాయణ విశేషములు.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

xiv

మంతుని బ్రహ్మచర్యము, విమానములు, ఆర్యావర్తప్రదేశము మున్నగు వానిని నిర్ణయించుటలో వారి యూహ సమర్థమైనది కాదని నా యల్ప బుద్ధికి దోచుచున్నది. ఇటులే యింకను కొన్ని దోషములు కొందరికి స్పష్టముగ గోచరము కావచ్చును. వాల్మీకి రామాయణ మొక పరమ పావన గ్రంథమని విశ్వసించుట భారతీయుల ధార్మిక కర్తవ్యమేయైనను, సద్విమర్శనకు గురిగాని గ్రంథరత్నము ప్రకాశింపదు. కావున పరీక్షకులు జంకక దొసగులను దొలగింప ప్రయత్నింతురని సాదరముగ నభ్యర్థించుచున్నాను.


సికింద్రాబాదు,
శా. శ. 1865- వైశాఖ
శుద్ధ ఏకాదశి.

చిదిరెమఠము వీరభద్రశర్మ,
విభూతి - సంపాదకుడు.