పుట:రామాయణ విశేషములు.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది

ix


రెండవ ముద్రణమునకై సిద్ధపరచబడిన రామాయణ విశేషముల ప్రతిలో మొదటి ముప్పదిరెండు పుటలు లేవు. మార్పులు కూర్పులతో నున్నట్టి యా భాగము ప్రతాపరెడ్డిగారు ముద్రింపించిరి. కాని ముద్రింప బడిన యీ పుటలన్నియు లభించలేదు మొదటి ఫారము లభించలేదు. దానిలో పీఠికలు మున్నగునవి ఉండియుండును. ఈ యూహముతో నేను శ్రీ ప్రతాపరెడ్డిగారి 'నా మనవి', శ్రీ వీరభద్ర శర్మగారి 'మాట', శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి పీఠిక లున్నవియున్నట్లుగా నిందు కూర్చితిని. వీనిని రెడ్డిగారు తాము రెండవ ముద్రణ మారంభించినపు డుంచిరో తీసివేసిరో తెలియదు. తీసివేయలేదనియే నా తలంపు. రెండవ ఫారమసలు గ్రంథముతో నారంభమైనది. ఈ గ్రంథమున 12 వ పుటలో రామాయణ ప్రాశస్త్యమను శీర్షికకు పూర్వమున్న వాక్యముతో రెడ్డిగారు మరల ముద్రింపించిన రెండవ ఫారము (16 వ పుట) పూర్తియైనది. మొదటి ప్రతితో పోల్చిచూడగా నీ రెండవ ఫారమున రెడ్డిగారు వాల్మీకి యెవరను శీర్షిక క్రింద అనేక విషయములు చేర్చినట్లు కనిపించినది. అనగా పదియవ పుట ఆరవ పంక్తినుండి గల విషయమంతయు క్రొత్తకూర్పే. మూడవ ఫారము మరల లభించలేదు. మన దురదృష్టమున నందేయే విశేషములు పోయినవో తెలియదు. నాల్గవ ఫార మీ గ్రంథమందలి 22 వ పుట 9వ పంక్తితో ప్రారంభమైనది. ఈ గ్రంథమున 12 వ పుటలోగల రామాయణ ప్రాశస్త్యమను శీర్షిక నుండి 22 వ పుట 8 పంక్తులవర కున్న విషయమంతయు ప్రథమ ముద్రణము ప్రతినుండి గ్రహించితిని. మొదటి ముద్రణమున వాల్మీకి యెవరను శీర్షిక క్రింద నున్న చివర 5 పంక్తులు ('వాల్మీకికి భరద్వాజుడను శిష్యు డుండెనని పై ద్వితీయ సర్గలో తెలిపినారు. ఇంతకన్న మించి వాల్మీకిని గురించిన యంశాలు మనకు తెలియవచ్చుట లేదు వాల్మీకి ఏకాలమువాడు అను విషయమును చర్చించుటకు గాను అతడు రాముని సమకాలికు డగుటచేత రాముని కాలము కూడ నిర్ణయించవలసి యుండును. కావున నీ రెండును