పుట:రామాయణ విశేషములు.pdf/108

ఈ పుటను అచ్చుదిద్దలేదు

58 రామాయణ విశేషములు


శ్లో. 28 లో "పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేనచ" అనుటచే రాముడు వనవాసమునకు వెళ్లునపుడు తండ్రి కూడ పౌరులతో పాటు చాలాదూరము వెంటవెళ్లెనని కలదు కాని అయోధ్యకాండలో ఇది లేదు.

॥52లో బంగారుజింక ముచ్చట లేదు. రామలక్ష్మణుల నొకేమారు మోసగించి దూరముగా మారీచుడు తీసుకొనిపోయెనట!

బాలకాండ మూడవ సర్గలో 9వ శ్లోకమునుండి సర్గ తుదివరకు రామాయణ సంగ్రహము చెప్పినారు. అందు మరికొన్ని విశేషాలు కలవు. పుష్పకమును రాముడు చూచెను అని కలదు (శ్లో. 38). అది రావణ భవనమని స్పురించును. సర్గతుదిలో “వైదేహ్యాశ్చ విసర్జనం" అని ఉత్తరకాండ సూచితము శ్లో. 87 లోను అటులే సూచితము. ఉత్తర 37 కాండ వాల్మీకి రచితముకాదని వ్యాఖ్యాత లొప్పుకొన్నారు. ఈ సంగ్రహ ములో దాని సూచన వచ్చుటచే ఇదియు తర్వాతివారిచే వ్రాయబడెనేమో? బాలకాండ నాల్గవ సర్గలో 4,5 శ్లోకాలలో కుశలవ అను శబ్దమున్నది. దానికి కథ చెప్పువారని అర్థమగును.

“వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్య మనిందితౌ” (శ్లో. 12)

అనుటచే వారు రామకథను (వాచోవిధేయం) కంఠపాఠము చేసిరి. 24,000 శ్లోకాలను కంఠపాఠము చేయగలిగిరా? రామాయణము పురాణముకాదు. "కావ్యము" అని పై శ్లోకమే తెలుపుచున్నది. దానిని వారు “పాడిరి” (జగతుః. బాల. 4-18) ఆ రామాయణమును ఎవరు ప్రదర్శింపగలరు? (ప్రయుఁజీయాత్. బా. 4-8) అని వాల్మీకి తలపోసె ననుటచే తందాన కథవలె అభినయముతో గానముతో కథ చెప్పబడే ననుట స్పష్టము.