పుట:రామాయణ విశేషములు.pdf/107

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 57


“వానరేంద్రం మ హేంద్రాభ మింద్రో వాలినమాత్మజం . " ఇంద్రుడు తనతో సమానుడగు వానరేంద్రుని వాలిని పుట్టించెనని కలదు (బాల. 17–10) అట్టి కారణకన్ముని శ్రీరాముడేల చంపెను?

శ్రీరాముడు "శైష్ఠ్యం శాస్త్రసమూహేషు ప్రాప్తోవ్యా మిశ్రి కేషుచ." శాస్త్రములందు వ్యామిశ్రకావ్యములందు ప్రవీణు డని వర్ణించి నారు (అయో. 1-27). రాముని కాలమందు

ప్రాకృత భాషలు వ్యామిశ్రి కము లుండెనా? ప్రాకృతోత్పత్తి పాణిన్యనంతరమై యుండును. కావున ఈ శ్లోకము ప్రక్షి ప్రమగును. రెండు. మొదటిది "ప్రాకృత వ్యాకరణసంప్రదాయములు హిందూదేశ ప్రాగ్భాగమునకును రెండవది పడమటిభాగమునకును సంబంధించినవి. శాకల్య భరత కోహలాదుల ననుసరించి వరరుచి వ్రాసిన ప్రాకృత ప్రకాశము తూర్పు సంప్రదాయమునకు చేరినది. పడమటి సంప్రదాయమునకు జేరిన సూత్రాత్మకమైన ప్రాకృత వ్యాకరణము మరి యొకటి. దానిని వాల్మీకి రచించెనని తన్మతానుసారులైన త్రివిక్రమ హేమచంద్ర సింహరాజ లక్ష్మీధర ప్రభృతులు చెప్పుచున్నారు. ఈ విషయము వివాదగ్రస్తమైయున్నది" అని శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు వ్రాసిరి. 1

3

బాలకాండలోని మొదటి సర్గలో రామాయణ సంగ్రహము తెలుప బడినది. అందు లేనివి విపులమగు రామాయణములో నుండుట అన్నిటగాకున్నను కొన్నిట ప్రక్షిప్తములనియు తర్వాత పెంచినవనియు సందేహము కలుగుట కవకాశము కలదు.

1 నుండి 19 శ్లోకాలు రాముని యుత్తమత్వ వర్ణన కలవి. 20 లో రాముని పట్టాభిషేకాలోచన కలదు. ఇందు తాటకావధ లేదు.

1. సంస్కృత వాఙ్మయ చరిత్ర - భాగము 1. పుటలు 65-66.