పుట:రామాయణ విశేషములు.pdf/106

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పక్షిప్తములు

1

రామాయణమును అనేకశతాబ్దములలో క్రమక్రమముగా అభి మానులు పెంచుచు వచ్చినారనుటలో ఏ మాత్రమును సందేహములేదు. పెంచినవారు తమ హస్తక్షేపములను గుర్తించకుండా బాగుగా ప్రయ త్నము చేసినవారు కారు. పరస్పర విరుద్ధములగు నంశములను వ్రాయుట, బౌద్ధ, క్రీస్తు శకానంతర విషయములను తమతమ కాలపు మత సాంఘిక స్థితులను గురించి వ్రాయుట, చరిత్రగా నుండదగిన దానిని అద్భుతములతోను మానవాతీతములతోను వర్ణించి పెంచుట, ఇట్టి వన్నియు ప్రక్షి ప్రములని భావింతును

శబ్దములు అర్థములు నాశ్రయించి కొన్ని విడ్డూరపు కల్పనలు చేసిరి. వాలి అన తోక కలవాడని యర్థమగును కావున అతడొక కోతి తోక పైననే పుట్టెనని వ్రాసిరి. సుగ్రీవుడన మంచి గ్రీవము కలవాడు కావున అతడు వాలిని తోక పైకన్న కోతిమెడ మీదనే పుట్టెనని వర్ణించిరి. ఇట్టివి పురాణములం దంతటను సర్వసాధారణముగా కనిపించు విశిష్టతలు! ఇవన్నియు ప్రక్షి ప్రములే యగును.

2

బాలకాండలోని రావణ వధోపాయ సర్గము (15), పాయసోత్పత్తి సర్గము (18). ఋక్ష వానరోత్పత్తి సర్గము (17), స్పష్టముగా తర్వాతి క ్పనలే! రావణవధార్థము పుట్టిన వానరులలో వాలికూడ చేరినవాడు.