పుట:రామాయణ విశేషములు.pdf/105

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 55


తతస్తు తౌ రామవచఃప్రచోదితా, అగాయతాం మార్గ విధానసంపదా సచాపి రామః పరిషద్గతశ్శనైఃబుభూషయా సకమనా బభూవహ. బాల. 4 సర్గ. 36 శ్లో.

మార్గపద్ధతిపై కుశలవులు వాల్మీకిరచిత రామాయణమును రాముని యెదుట గానము చేసిరని పై శ్లోకమందు తెలుపబడినది. ఉత్తర కాండములో కుశుడు, లవుడు అను ఇద్దరు ఆమడలు సీతకు వాల్మీక్యాశ్ర మములో పుట్టిరని వ్రాసినారు. కుశలవపదాలను జంటగా చేర్చినపుడు ద్వంద్వసమాసములో కుశీలవ అని యగునని పండితులు సమర్థించినారు. కాని కుశీలవ పదాని కింకొక అర్థమున్నది శబ్దకల్పద్రుమములో నిట్లు వ్రాసినారు: "కుశీలవ___చారణః - నటవి శేషః - కథకాదిః - దేశాంతరే కీర్తిం ప్రచారతి యో నటః" అని వ్రాసినారు. వాల్మీకి వ్రాసిన రామాయణ మును కుశలవులు, కుశీలవులు - అనగా గానము చేసి కథ చెప్పుటలో నేర్పరులైన కొందరు శిష్యులు అయోధ్యాపురములో తందాన కథగా చెప్పినారని తోచుచున్నది. మార్గమనెడి పద్దతిలో గానముచేసినారనుటలో విశేషమున్నది.

మార్గ విధానము

ప్రాచీనములో గానమందు మార్గపద్ధతి దేశపద్ధతి అను రెండు విధానము లుండెను. పై శ్లోకానికి గోవిందరాజిట్లు వ్యాఖ్య వ్రాసెను: “దేశీ మార్గ శ్చేతి ద్వౌ గానప్రకారౌ, తత్రమార్గ స్పార్వత్రికః, దేశిఃక్వా చిత్కః తయోర్మధ్యే మార్గ నిర్వాహ సామగ్ర్యా అగాయతాం." గానములో దేశీ గానమనియు, మార్గ గానమనియు రెండు విధాలు గలవు. మార్గ విధానము భరతఖండములో అంతటను (సార్వత్రికమై వ్యాపించినట్టిది. దేశీగానము మండల భేదాలను బట్టి (క్వాచిత్కముగా) భిన్నభిన్న ప్రదేశా లలో భిన్నభిన్నముగా వర్తించుచుండెను. సంగీత శాస్త్రమందును దేశిమార్గ భేదములచే గానద్వైవిధ్యము నిరూపింపబడినది.