పుట:రామాయణ విశేషములు.pdf/103

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 58

అనునత డెవ్వడో తెలియరాదు. అతడు ఇంద్రుడని కొందరి అభి ప్రాయము, సూత్రకాలములోను, పురాణకాలములోను ఒక వేనరాజు ప్రసిద్ధిపొందినాడు. శ్రీ లందరును స్వేచ్ఛాచారిణులుగా నుండవలెననియు ఏ శ్రీనైనను ఏ పురుషుడైనా పొందినట్లైన అది ప్రకృతిధర్మమేగాని తప్పు లేదనియు వేనరాజు శాసించి యుండెను. ఈ పశు ధర్మము మనుస్మృతిలో నిట్లుగర్హింపబడినది :

ఆయం ద్విజైరి విద్వద్భిః పశుధర్మో విగర్హితః మనుష్యాణా మపి ప్రోక్తో వేనే రాజ్యం ప్రశాసతి. మనుస్మృతి. 9 ఆధ్యా - శ్లో 88.

స్త్రీలకు పశుధర్మమే సరియైనదని శాసించిన వేనుడు రాము డగునా? వేదోదాహృత వేనుడు వేరు, స్మృత్యుదాహృత వేనుడు వేరు అనుటకు సందేహము లేదు. వేదమందలి వేనుడు మంచివాడుగా గొప్ప వాడుగా వర్ణింపబడినాడు. స్మృతి పురాణాలలోని వేనుడు దుష్టరాజుగా వర్ణింపబడినాడు. అయితే ఋగ్వేద వేనుడును రాముడును ఒక రే అనుటకు నిస్సందేహమగు ఆధారాలు కానరాలేదు.

రాముడు కల్పిత పురుషు డనియు, ఋగ్వేదములోని ఇంద్రుడు వర్షాధిపతిగాను, సీత భూమికి సంబంధించిన నాగేటి చాలుగాను వర్ణించి నందున దానినే ఒక కథగా పెంచినారని కొందరు పాశ్చాత్య విమర్శ కులు వ్రాసినారు. ఈ విధముగా శబ్దముల నానార్థములనుబట్టి చారిత్రక విషయాలను చాలావరకు కల్పితములుగా నిర్ణయింపవచ్చును. మహా భారతమును గురించికూడా ఇదే విధముగా సద్గుణ దుర్గుణముల సంఘర్షణ మునే ఒక మానవకథగా పెంచినారని వాదించువారును కలరు

రాముని దివ్యచరిత్రమును మహాభారతకాలమువరకే వేలకొలది మైళ్ళదూరములో సముద్రాంతరమందుండు ఖండాంతరములలోని జనులు