పుట:రామాయణ విశేషములు.pdf/102

ఈ పుటను అచ్చుదిద్దలేదు

52 రామాయణ విశేషములు


"వ్యాసు డొకమారు జరథుస్తునితో తుర్కిస్థానములోని బల్బ్ వాదించెను. లిడియాదేశపు జాంథన్ అనువాడు క్రీ. పూ. 470 లో ఉండెను. జరథుస్త్రుడు ట్రాయి యుద్ధానికి 600 ఏండ్లకు పూర్వముండెను. అనగా క్రీస్తుకు పూర్వము 1800 లో ఉండె"నని అతడు వ్రాసెను. బాబి లోనియా చరిత్రకారుడైన బెరోనస్ అనువాడు జరుథుస్త్రుడు బాబిలోనియా రాజుగా నుండెననియు క్రీ. పూ. 2200 నుండి 2000 వరకు బాబిలోని యాను రాజ్యముచేసిన రాజులసంతతి కర్తయయ్యెననియు వ్రాసెను.

ఈ నిర్ణయము ప్రకారము జరుథుస్త్రుడు వ్యాసుని కాలము వాడైతే అప్పుడు వాల్మీకికాలము ఇంకా ముందుకు అనగా క్రీ. పూ. 2500 వరకైనను పోవును. అనగా నా వాదమును బలపరచుచున్నది.

ఛటర్జీ వాదాన్ని అవలీలగా త్రోసివేసే వీలులేదు. పారసీకుల అవెస్ట్గా, గాథా గ్రంథాలభాష నూటికి 80 పాళ్లు సంస్కృతముతో కూడి నది. వారు అసురపూజకులై యుండిరి. ప్రాచీన ఈరాను దేశమును “ఫరసు” అని పిలిచిరి. మన “పరశు రాముడు “ఫరస్ " రాముడేమో! రామాయణములో పరశురామునికి రామునికి సంఘర్షణము జరిగెననియు, వృద్ధపరశురాము డోడిపోయెననియు, అతని నోడించిన శ్రీరాముడు నవయౌవనుడుగా నుండెననియు రామాయణములో వ్రాసినారు. ఈ కారణములనుబట్టికూడ ఛటర్జీ వాదాన్ని పరిశీలించవలసి యుండును. మన పరిశోధక పండితులు ఈరానులో వ్యాప్తినొందిన (ఖిలమగు భృగు సంహితను) గాధా అవెస్తాలు బోధించిన జరుథుస్తుమతమును ఛటర్జీగారి విమర్శతో చదివి ఇంకను మనకు క్రొత్తసంగతులు తెలుపగలరను దృష్టితో అతని భావములను ఉదాహరించినాను.

వేనుడును రాముడును ఒకరే అను ఛటర్జీవాదము సరియైన దనుటకు వారే సరియగు ప్రమాణమేదియు చూపించలేదు. వేనుడు