పుట:రామమోహన నాటకము.pdf/7

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రస్తావన.

3

పారీణులు. నీతివంతులే నీతిని బోధింపఁ జాల రేని దుర్నీతిపరు లా నీతిని నేర్పువారు ? నిస్సంశయముగ నేఁటి మీ యుద్యమము చక్కఁగ నెఱవేఱఁగలదు.

సూ__మంచిది. పరమేశ్వరునిపై భారము వైచి శక్తి కొలఁది మనము పాటుపడుదము. అటు చూడు ! సభాసదులు ఆటఁ జూడవలె నని యెంత కుతూహలముతో నిరీక్షించుచున్నారో? కాని తెరలోపల నంతయునింకను సంసిద్ధముగ లేదు. కనుక వీరి తమకమును నీగానముచేఁ గొంత శాంతి పఱపుము.

స__చిత్తము. ఏఋతువును గూర్చి పాడుదును ?

సూ__ఈఋతు వాఋతు వన నేల ? ఎల్లఋతువులను సృజియించి ప్రపంచమునంతను నానంద సాగరములో నోలలాడించుచుండు కరుణామృతవారిధి యగుపరమేశ్వరుని గీర్తింపుము.

గు__చిత్తము.

సీ. హృదయనందనమును * ముదముతోఁ బొదలించు
       సంతోషదాయి వ * సంతుఁ డెవఁడు
భావంబులోపలి * పాపజాలమ్ములఁ
       బట్టి పీల్చెడు గ్రీష్మ * భానుఁ డెవఁడు
స్వాంతంబులో శాంతి * వర్షంబు గురియుచుఁ
       గ్రాలెడు ఘనఘనా * ఘనుఁ డెవండు