పుట:రామమోహన నాటకము.pdf/5

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ మోహన నాటకము

________________


నాoది.

( సూత్రధారుఁడు ప్రవేశించుచున్నాఁడు.)

ఉ. ఏకరుణాసుధానిధి య * హీనధృతిక్ బురికొల్పుచుండునో

లోకమునక్ బరోపకృతి * లోలుల చిత్తములోన, నాతఁ డ

స్తోక సుఖపవర్షముల * దోఁగఁగఁ జేయును గాత మిమ్ములక్

బ్రాకటధర్మమూర్తుల స * భాసదులక్ బరిశుభ్ర కీర్తులక్.

(అని నాంద్యంతంబునందన యంజలిలోని కుసుమంబుల

సభాసదులపైఁ జల్లి తెరవంకఁ జూచి)ప్రియా ! గుణవతీ !

( యని తన ధర్మపత్నిని బిలుచుచున్నాఁడు. )

గుణవతి-ప్రవేశించి) స్వామీ ! ఆర్యపుత్ర ! ఏమి సెలవు ?

(అని వినయముతో నడుగు చున్నది.)

సూ__ఏమహానుభావుఁడు అధ:పతిత మైనయార్యావర్తము

నుద్ధరింప నెంచి పరమకృపాళు వగు పరమేశ్వరుఁడు దనకుఁ

బ్రసాదించిన సమస్త శక్తులను వినియోగ పఱచి సకలకలా

పరిపూర్ణుం డగు శరత్పూర్ణి మా చంద్రునిం బోలె మనహృద

యాకాశంబులఁగీర్తి కాయంబుతో నిరంతరంబు ప్రకాశించు

చున్నాఁడో, అట్టి శ్రీరాజారామమోహన రాయలపవిత్ర

చరిత్రను నేఁటి రాత్రిఁ బ్రదర్శింపవలెనని పెద్దలు సెలవిచ్చి