పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/36

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరవిలాసము

19


వరయోగిజనలోల! దురితాభ్రవారూల! సురరాజవరపాల! శరణుశరణు!
రణరంగరిపుభంగ! రమణీయధవళాంగ! చతురాగముతురంగ! శరణు శరణు!
సలలితాంభోధితూణీర! శరణు శరణు! | శాశ్వతైశ్వర్యసంయుక్త! శరణుశరణు!
సౌధులోకసురోర్వీజ! శరణుశరణు! | శరణు! విశ్వేశ! భూతేశ! శరణుశరణు!


పొంకంబుగల మంచిజింక నంకంబుగాఁ గొంకక ప్రేమతోఁ జంక నిఱికి
దిట్టతనంబుతో గట్టిగా సామేన గట్టులదొర ముద్దుపట్టి నునిచి
వింతఁగాని కనుఁబూబంత గా జాబిల్లి నెంతయు సంతసం బెనఁగ నిలిపి
మేలైనయేనికతోలు శాలుగఁ బూన లీలతో ముమ్మొనవాలుఁ దాల్చి
పొసఁగ భసితంబుఁ బూసి యాఁబోతు నెక్కి | గాలిమేతరిసొమ్ములఁ గడు ధరించి
లచ్చిమగఁడును నలువయు మెచ్చి పొగడ | జగము లేలెడునినుఁ గొల్తు నిగమవినుత.


శా.

నీరజోద్భవముఖ్యులౌ సురమునుల్ ని న్బ్రస్తుతుల్ సేయఁగాఁ
దారొక్కింతయు నేరరంచును బుధులే తథ్యంబుగాఁ బల్కుచో
నో రాజార్ధకెరీట! మర్త్యుఁ డిఁక నెట్లోపున్ బ్రశంసింపగా
గౌరీమానసపద్మషట్చరణ! శ్రీకంఠా! జగద్రక్షకా.


గీ.

శివశివా యని సన్నుతి సేయనేర | వినయ మొప్పారఁ బూజఁ గావింపనేర
మూఢుఁడను నన్ను గృపఁజూడు ముదముతోడఁ | బార్వతీలోల సంతతభక్తపాల.


క.

జయజయ పురదైత్యాంతక | జయజయ శృంగారలీల నదమలశీలా
జయజయ నాకాధిపనుత | జయజయ లోకాధినాథ జయ పరమేశా.


వ.

ఇ ట్లనేకప్రకారంబులఁ బ్రస్తుతించి తదనంతరంబ.


క.

తరుణారుణాంశనిభభా | సురనవరత్నచయఖచితశోభితదివ్యా
భరణోజ్వలాంగుఁడయి స | త్వరతరచిత్రాంబరములు ధరియించె వెసన్.


గీ.

అరయ రుద్రాక్షమాలిక లఱుత మెఱయ | ఫాలమున భూతిరేఖయు శ్రీలఁ దనరఁ
బసిఁడిపావలు దొడిగి వైభవము చెలఁగఁ | గప్రపువిడెంబు సేయుచుఁ గౌతుకమున.


సీ.

దివి పిక్కటిలఁ బెక్కుతెఱఁగుల నెడలేక భేరీమృదంగముల్ భోరు చెలఁగ
గంతునిచేతి చేమంతిబంతు లనంగ వంతుకెక్కిన కళావంతు లాడ
తుంబురునారదాదులఁ దిరస్కృతి సేయు గాయకుల్ గీతముల్ కడఁగిపాడ
వందిమాగధులు చెల్వంది ప్రస్తుతి సేయఁ జేరి భూదేవు లాశీర్వదింప
రమణఁ బరిచారికలు ముందఱను బిరుందఁ | బసిఁడిబెత్తులనెఁ బరాగతు లొనర్ప