పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరవిలాసము

ప్రథమాశ్వాసము

శ్రీనగజాత నుద్యుతులు చెల్వు మెఱుంగులుగా వియన్నదీ
ధ్వానము లెల్ల గర్జితకదంబముగా రజతాచలాంబరా
స్థాని వసించు శర్వజలదంబు కృపారసధారమీర మ
న్మానసబర్హి నెంతయు ఘనంబుగ సంతసమొందఁజేయుతన్.


చ.

కరిముఖుఁ గన్నతల్లి, శశిఖండవిభూషణు కూర్మిరాణి, భూ
ధరవరు ముద్దుపట్టి, నిజదాసగృహాంగణకల్పవల్లి కి
న్నరగరుడోరగాద్యమరనవ్యకిరీటమణిప్రభాతి వి
స్ఫురితపదాబ్జ యాత్రిపురసుందరి మాకు నభీష్ఠ మిచ్చుతన్.


ఉ.

పల్లవపల్లవాధరు, లవారితభక్తిని బాలుఁడంచుఁ ద
న్మెల్లనఁ బిల్చి యెంతయును మేలగు క్రొవ్విరిబొళ్ళొసంగఁ దా
నొల్లక యల్ల కప్పికొనియుంచిన బంతు లొసంగుమంచు భా
సిల్లుకుచంబు లంటుచు హసించు ముకుందుఁ డభీష్ఠ మిచ్చుతన్.


గీ.

కమలజార్చితమృదుపద కమలయైన | కమల మాయింట నేప్రొద్దు కడుముదమున
నిలిచి యభిలాషి తార్థమున్ గలుగఁజేసి | చిరతరంబైన కృపను రక్షించుఁగాఁత.


క.

ఎంచఁదగు నంచతేజిని | జంచలగతి నెక్కుజాణ సరసిజగర్భుం
డంచితమతిచేఁ దానొన | రించుంగావుతను మాకుఁ బ్రేమన్ శుభముల్.


సీ.

వేదాదివిద్యల వెలయించు పూబోణి నెఱిభక్తతతిఁ బ్రోచు నీలవేణి
యురుకవిత్వప్రౌఢి యొనగూర్చు కళ్యాణి మహనీయపుస్తకమహితపాణి
నిఖిలగీర్వాఁణవర్ణితసద్గుణశ్రేణి నిజలోచనప్రభానిర్జితైణి
ఘనతరోత్తుంగసైకతసన్నిభశ్రేణి రాజీవభవుని గారాబురాణి
సమదపికవాణి యవ్వాణి సంతతంబు | మదిని దైవార రచియించు మత్ప్రబంధ
మరసి దుర్దోషరహితమొనట్లుగాను | జిరకృపాస్ఫూర్తిఁ బరిపూర్తి జేయుఁ గాఁత.


చ.

పొలుపుఁగ నీశుకంఠమున బూనినయట్టి కపాలమాలికల్