పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/2

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరచరిత్రము

ఈ రాజశేఖరచరిత్రమును రచించిన కవి మాదయ్యగారి మల్లన్న. ఈతనికి పూర్వము ఏకాదశీమాహాత్మ్యమును రచించిన ప్రౌఢకవి మల్లన్న యొకడుండుటచేత నీతనిని మాదయ్యగారి మల్లన్న యనుచుండిరి. ఈత డఘోర శివాచార్యుని శిష్యుడు. శౌనకగోత్రుఁడు, అయ్యంకిపురాగ్రహారస్వామి. అయ్యంకి గ్రామము కృష్ణామండలములోని చల్లపల్లి సంస్థానములనిది. ఈతడు రచించిన రాజశేఖరచరిత్రము మూఁడాశ్వాసముల రసవత్కావ్యము.

క. చెప్పఁదగుఁ గవిత రసముల్
     చిప్పిల నప్పప్ప బళిబళీ యనలేదా
     యెప్పుడుఁ జేయక యుండుటె
     యొప్పుఁజుమీ సుకవి కెంత యుచితజ్ఞుడొకో.

ఈతని కవిత్వము నిర్దుష్టమై ప్రౌఢభావవిలసితమై, రసవంతమై, యనర్గళధారావిలసితమై, మనోజ్ఞకముగా నుండును.

శా. గాఢార్ధప్రతిపాదన క్రమకళాకౌశల్యము ల్లేక, వా
     చా ఢక్కార్భటితోడఁ దామ తము మఝ్ఝాయంచుఁ గైవారముల్
     ప్రౌఢిం చేయుచుఁ బ్రాజ్ఞులన్నగుచు గర్వగ్రంధు లైయుండు న
     మ్మూఢస్వాంతుల మెచ్చకుండుటయె సమ్మోదంబు మాబోంట్లకున్.

అని కవితారచన కొకమార్గమును నిర్దేశించి యట్లే తన కావ్యమును నిర్వహించెను.

ఇతర ప్రబంధముల వలె వర్ణనాబాహుళ్యముతో సరిపెట్టి కథావస్తువును పెండ్లి, వేటలతో సరిపెట్టక కళాపూర్ణోదయమువలె, విచిత్రతరకల్పనలు పొంపిరి పోవునట్లు కథావైచిత్రిని గల్పించి, తన యనల్పకల్పనాకౌశలిని వెల్లడించెను.

కవికాలనిర్ణయమునకు కృతిపతి నాదిండ్ల అప్పామాత్యుని కాలము సహకారిగా నున్నది. నాదిండ్ల అప్పామాత్యుఁడు ఆఱువేల