పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/48

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రఁగా శత్రులను, ఏపడఁపన్ = మట్టు పెట్టుటకు, వలంతియై, మిత్రకులంబు = బంధువులయొక్క కులము, తలిర్ప, పౌరవ = పూరునిసంబంధమైన, సుసంతతి = సత్కులమందుఁ గల - "సంతతిర్గోత్రజననకులాని” అని అ. రాజుల కెల్లన్ = యయాతి భరతుఁడు మొదలయిన రాజులకందరికిని, హెచ్చుగ, ఏలెను, క్రియ.

క.

సుబలతనయగుణమహిమన్, బ్రబలి తన కుదారధర్మపాలనలీలన్
సొబ గొంది వన్నె దేఁగా, విబుధస్తుతుఁ డవ్విభుండు వెలసెన్ ధరణిన్.

4

భారత. సుబలతనయ = గాంధారి, గుణ = సౌశీల్యాదిగుణములయొక్క, మహిమన్ = మహిమచేత, క. 'వినుతద్ద్వితీయసప్తమి, కిని మఱిమూఁడవవిభక్తికిని నిడఁగానౌ, విన నింపుపుట్టుపట్టున, నను వెఱిఁగి ప్రబంధములఁ బయోంబుధిశయనా.' అని కవిలోకచింతామణియందు, ప్రబలి తనకు, దారధర్మ = స్మృత్యుక్తమైన భార్యాధర్మముయొక్క, పతివ్రతాచారముయొక్క యనుట, “ఆర్తార్తే ముదితే హృష్టా ప్రోషితేమలినాకృశా, మృతేమ్రియేత యా నారీ సాస్త్రీజ్జేయా పతివ్రతా” అని స్మృతి. "ధర్మఃపుణ్యేయమే న్యాయే స్వభావాచారయోః క్రతౌ" అని అ. పాలనలీలచేత, "ప్రదిత్సతస్స్వం పితురం ధమాత్మనో నిశమ్య భర్తారమగూఢసమ్మదా, అరుంధతీకీర్తిమసౌ నిరుంధతీ బబంధ పట్టేన దృశౌ ప్రతివ్రతా” అని బాలభారతమందును జెప్పియున్నది గనుక, సొబగొంది = ఒప్పినదై, వన్నె దేఁగా “అనుకూలాం విమలాంగీం కుశలాం కులజాం సుశీలసంపన్నామ్, పఞ్చలకారాంభార్యాం పురుషః పుణ్యాధికో లభతే" అని చెప్పుదురు. విబుధస్తుతుఁడు = పెద్దలచేత స్తోత్రము చేయఁబడినవాఁడు, “విబుధః పండితే దేవే” అని వి. అవ్విభుండు = ఆధృతరాష్ట్రుఁడు, వెలసెను.

రామ. సుబలత = బలిమి, బహువ్రీహిమీఁది తల్ప్రత్యయాంతము, నయగుణమహిమచేతఁ బ్రబలి యుదారధర్మపాలనలీలచేత, సొబగొంది తనకు వన్నె దేఁగా, ఈయర్థమున సుబలత యనునది కర్తృపదము. విబుధ = దేవతలచేత, స్తుతుఁడు, అవ్విభుండు = దశరథుండు, వెలసెను, అర్థాంతరము. సుబలతన్ = బలిమిచేతను, అయగుణ = భాగ్యలక్షణములయొక్క, “అయశ్శుభావహోవిధిః" అని అ. "గుణః ప్రధానేశబ్దాద్ మౌర్య్వాం సూదే వృకోదరే” అని వి. మహిమచేతఁ బ్రబలి, ఉదారధర్మపాలన = దుష్టనిగ్రహశిష్టానుగ్రహాదిధర్మములయొక్క సంరక్షణము, ణ్యాసశ్రంభోయుచ్చని యు చ్ప్రత్యయాంతము గనుకఁ బాలనాశబ్దము స్త్రీలింగము. ఉ. 'పాండవసైన్యసంఘపరిపాలన సేయు, నితండయంచుఁ గృష్ణుం డభిషేకసంపదుపశోభితుఁ జేయఁగ' నని సోమయాజియు స్త్రీలింగముగాఁ బ్రయోగించినాఁడు. ఇటువంటి శబ్దములు ల్యుట్ప్రత్యయాంతము లైనపుడు నపుంసకలింగములు నవును గనుక రెండులింగములును గలవని ముందును దెలిసికొనునది, వన్నె దేఁగా, ఈయర్థమున ధర్మపాలన యనునది కర్తృపదము, వెలసెను