స్వభావముగాఁగల, స్థూలంభవిష్ణు = తోరముగాఁ గల - వృద్ధిఁబొందుచున్న దనుట, స్థిర = నిల్కడ యైన, భుజబల = బాహుబలముయొక్క, లక్ష్మీవిశేష = సమృద్ధ్యతిశయముచేత, ప్రయుక్త = ప్రయోగింపఁబడిన - కలుగఁజేయఁబడిన దనుట, ఉద్వేలాశా = దిగంతములయందున్న, దంతి = దంతావలములయొక్క, శుండా = తుండములయొక్క, విలసన = విజృంభణముకొఱ కైన, లఘిమావేశున్ = లఘుత్వప్రవేశము గలవాని, ఇమ్మక్షితీశున్ = ఇమ్మభూపతిని, సుతున్ = పుత్త్రునిగా, కనియెన్ = కాంచెను.
క. | రాజమహేంద్రవరాధిపు, రీజైత్రవిచిత్రములఁ బరిభ్రాజితుఁ డై | 25 |
టీక. రాజమహేంద్రవర మనెడు, అధిపురీ = పట్టణశ్రేష్ఠముయొక్క, జైత్ర = జయశీలమైన, విచిత్రముల = వింతపనులచేత, పరిభాజితుఁడై = ప్రకాశింపఁబడినవాఁడై, ఆజిఘనుండు = రణశూరుఁ డయిన, ఆయిమ్మమహీజాని = ఆయిమ్మరాజు, ఎంతయుమహిమన్ = మిక్కిలి ప్రభావముచేత, ప్రసిద్ధి గాంచె = ప్రఖ్యాతిఁ జెందెను.
తే. | ఆమహీలోకవిభుని యర్ధాంగలక్ష్మి | 26 |
టీక. ఆమహీలోకవిభుని = ఆయిమ్మభూవరునియొక్క, అర్ధాంగలక్ష్మి = అర్ధశరీరలక్ష్మి, ఐన = అయినట్టి - అనఁగా భార్య యయిన, కసవమ్మ = కసవాంబ, అనసూయ = అనసూయాదేవియు - అసూయ లేనిదియు, అగుటన్ = అవుటచేతను, ఆర్య = పార్వతీదేవియు - కులీనయు, అగుటన్ = అవుటచేతను, సుప్రసిద్ధమ = తేటతెల్లమె, వినుతికెక్కు = ప్రఖ్యాతి నొందిన, పాతివ్రత్యవిలసనంబు = పతివ్రతామహిమను, వేఱె = ప్రత్యేకముగా, అడుగ నేల = విచారింప నేమిటికి.
క. | ఆయిమ్మడిధాత్రీతల, నాయకునకుఁ గసవమకును నందను లధిక | 27 |
టీక. ఆయిమ్మడిధాత్రీతలనాయకునకున్ = ఆయిమ్మభూపతికిని, కసపమకును = కసవాంబకును, అధికశ్రీయుతులు = ఘనలక్ష్మీసమన్వితులు, సుజనవిధేయులు = సజ్జనుల కడఁగినవారు, బొమ్మప్రభుండు = బొమ్మరాజును, తిమ్మవిభుండు = తిమ్మరాజు ననఁగా, ఇద్దరు = ఇరువురైన, నందనులు = సుతులు - కల రని శేషము.
వ. | వారిలోన. | 28 |
టీక. వారిలోనన్ = ఆయిరువురిలోపల.