పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

, ఉత్తంసిత = శిరోభూషణముగాఁ జేయఁబడిన దై, భవ్య = ఒప్పిదము నైన - యుక్తమైన దనుట, శాసనకళా = శిక్షావిధికి, హేతు = కారణమైన, ప్రతాప = పరాక్రమముచేత, ఆఢ్యుఁడై = సంపన్నుఁడయి - అతని పరాక్రమమునకు వెఱచి రాజులందఱు నతనియాజ్ఞ శిరముచే వహించుచుండిరి (అనఁగా రాజులంద అతనికి లోఁబడిరని భావము.), మూర్తామోదమున్ బోలెన్ = మూర్తివంతమైన వాసనావిశేషమువలె, సర్వాశా = ఎల్లదిక్కులయందు, పూరిత = నిండింపఁబడిన, కీర్తి = యశ మనెడు, వాసనలతోన్ = గంధములతోడ, ఆవిర్భవించెన్ = జనించెను.

తే.

ఆకువీటిపురీశాసనాంకుఁ డగుచు
సకలసంగ్రామకేళినిశ్శంకుఁ డగుచు
ననిశపూజితశేషపర్యంకుఁ డగుచు
నతఁడు సొంపొందు యువతిమీనాంకుఁ డగుచు.

22

టీక. ఆకువీటిపురీశాసన = ఆకువీటిపురప్రభు వనెడు, అంకుఁ డగుచున్= పేరుగలవాఁ డగుచు, సకలసంగ్రామకేళి = సమస్తయుద్ధక్రీడలయందు, నిశ్శంకుఁ డగుచున్ = జంకు లేనివాఁ డగుచు, అనిశ = నిరంతరము, పూజిత = అర్చింపఁబడిన, శేషపర్యంకుఁ డగుచున్ = అనంతుఁడు శయ్యగాఁ గలవిష్ణుమూర్తి గలవాఁ డగుచు, యువతిమీనాంకుఁ డగుచున్ = మానినీమన్మథుఁ డగుచును, అతఁడు = ఆయిమ్మభూపతి, సొంపొందున్ = యింపొందెను.

క.

కౌండిన్యగోత్రజలధివి, ధుం డాతఁడు గాంచె వరసుతున్ భావమహీ
మండలపతిఁ గదనబలో, ద్దండుని లక్ష్మాంబ యనెడు తనసతియందున్.

23

టీక. కౌండిన్యగోత్ర మనెడు, జలధి = సముద్రమునకు, విధుండు = చంద్రుఁ డయిన, ఆతఁడు = ఆయిమ్మభూపతి, లక్ష్మాంబ యనెడు, తనసతియందు = తనభార్యయందు, కదనబలోద్దండునిన్ = యుద్దమునందలి బలిమిచేత భయంకరుఁడైనవాని, భావమహీమండలపతిన్ = భావరాజును, వరసుతున్ = శ్రేష్ఠుఁడైనపుత్త్రునిగా, కాంచెన్ = కనెను.

స్రగ్ధర.

ఆలక్ష్యాంబాకుమారుం డమలయశుఁడు భావావనీశుండు సాధ్విం
బోలాంబన్ బెండ్లి యై యొప్పుగఁ గనియెన్ సుతు భూపరిరంభలీలా
శీలస్థూలంభవిష్ణుస్థిరభుజబలలక్ష్మీవిశేషప్రయుక్తో
ద్వేలాశాదంతిశుండావిలసనలఘిమావేశు నిమ్మక్షితీశున్.

24

టీక. ఆలక్ష్మాంబాకుమారుండు = ఆలక్ష్మమ్మపుత్త్రుఁ డయిన, అమలయశుఁడు = నిర్మలకీర్తి గలవాఁ డైన, భావావనీశుండు = భావరాజు, సాధ్విన్ = పతివ్రతయైన, పోలాంబన్ = పోలమను, పెండ్లియై = వివాహమయి, ఒప్పుగన్ = తగునట్లుగా, భూ = భూదేవియొక్క, పరీరంభ = కౌఁగిలింతయందుఁ గల - భూమివహన మనుట, లీలా = వేడుకయే, శీల =