సమర్థుఁడు, ఎవ్వాఁడు = ఏకవి, కలఁ డని శేషము. కావున నీకంటె నెవఁడును లేఁడని భావము.
ఉ. | భీమన తొల్లి చెప్పె నను పెద్దలమాటయె కాని యందు నొం | 11 |
టీక. తొల్లి = మునుపు, భీమన = భీమన యనుకవి - రెండర్థముల కావ్యము నని తెచ్చుకొనునది, చెప్పెను = వచించె ననుట, అను = అనునట్టి, పెద్దలమాటయె కాని = వృద్ధులవాక్యమే కాని - రెండర్థముల కావ్యము నొకదాని భీమన చేసినట్టు పెద్దలు వాడుకొనుచున్నారని భావము, అందున్ = ఆకావ్యమునందు, ఒండు = ఒకటి, ఏమియున్ = ఏదియు - ఒకపద్యము నైన ననుట, ఏయెడ = ఎచ్చోటను, నిలుచుట = వర్తించుటను, ఎవ్వరును = ఏవారును, కానరు = ఎఱుఁగరు, అటుండనిమ్ము = ఆవార్త యట్లుండనీ - ఇట నిది యనాదరోక్తి, ఇఁక నేమనఁగా, నానా = పెక్కులయిన, మహిత = పూజ్యము లయిన, ప్రబంధ = కావ్యములయొక్క, రచనా = ఒనర్పుచేత, ఘన = అధిక మయిన, విశ్రుతి = ఖ్యాతి, నీకు, కల్గుట = లభించుటచేత (ఇది హేతువు), తత్ = క్రిందటఁ జెప్పిన, ద్వయార్థ = రెండర్థములప్రబంధముయొక్క, కృతి = కూర్పునందుఁగల, నైపుణియున్ = నేర్పును, కల దంచు = నీకుఁ గలదని, నామదిన్ = నాహృదయమునందు, ఎంచెదన్ = తలఁచెదను.
క. | చాటుప్రబంధరచనా, పాటవకలితుఁడవు శబ్దపరిచితియందున్ | 12 |
టీక. చాటుప్రబంధ = సంఖ్యాకాసంఖ్యాకాదిభేదప్రశస్తకృతులయొక్క, రచనా = ఒనర్సునందుఁ గల, పాటవ = నైపుణ్యముతోడ, కలితుఁడవు = కూడుకొన్నవాఁడవు, శబ్దపరిచితియందున్ = శబ్దపరిజ్ఞానమునందును - సాహితియం దనుట, మేటివి = సమర్థుఁడవు, కావున, అరయన్ = విచారించి చూడఁగా, దీని = ఈరెండర్థములకావ్యమును, తెనుఁగున = ఆంధ్రమునందు, పాటించి = కైకొని, రచింపన్ = ఒనర్చుటకు, నీవ = నీవే, ప్రౌఢుఁడవు= జాణవు.
ఉ. | దక్షత యింత గల్మి విశదంబుగఁ గాంచియు నీమదిన్ ఫలా | 13 |