చేత, స్థిర = తిర మైన, వృత్తి = వ్యాపారము గల, మీసాలతిమ్మశౌరి = మీసాలతిమ్మరాజో, ఏనృపోత్తము = ఏరాజశ్రేష్ఠునియొక్క, తల్లి = జనని, మానిత = మన్నింపఁబడిన, పరమ = శ్రేష్ఠము లయిన, సాధ్వీగుణంబుల = పాతివ్రత్యగుణములకు, ప్రోక = రాసియైన, తిమ్మమాంబ = తిమ్మాంబయో! ఏధీరు = ఏధృతిమంతునియొక్క, అనుజన్ములు = తమ్ములు, ఇద్ధ = ప్రకాశింపఁజేయఁబడిన, దాన = త్యాగముచేతను, క్షాత్ర = క్షత్రభావముచేతను – అనఁగాఁ బరిపాలనాదు లనుట, భద్రుండు = మంగళకరుఁ డయిన, చినవేంకటాద్రినృపుఁడు = చిన్నవేంకటాద్రిరాజును, ఘనులు = అధికులయిన, వేంకటరాయ = వేంకట్రాయనృపుఁడును, వేంకటవరద = వేంకటవరదప్రభువును, అనన్ = అనఁగా, ప్రసిద్ధులు = ఖ్యాతి కెక్కినవారు, ముగురు = ఈమువ్వురో, అట్టి = అటువంటి, ఆకువీటి = ఆకువీడను, పుర = పట్టణమునకు, వర = ఱేఁ డనెడు, అంకుండు = చిహ్నము గలవాఁడు, త్రిభువన = ముల్లోకములయందు, పూర్ణ = నిండిన, కీర్తి = యశము గలవాఁడు, అతుల = ఈడు లేని, తేజుండు = పరాక్రమము గలవాఁడు, పెదవేంకటాద్రివిభుఁడు = పెదవేంకటాద్రిరాజు.
వ. | నిజాస్థానంబున సంగీతసాహిత్యాదివివిధవిద్యాప్రసంగంబులం బ్రవ | 8 |
టీక. నిజ = తనయొక్క, ఆస్థానంబునన్ = కొలువుకూటమునందు, సంగీత = గానము, సాహితీ = సాహిత్యము, ఆది = మొదలుగాఁగల, వివిధ = అనేకములయిన, విద్యా = విద్యలయొక్క, ప్రసంగంబుల = ప్రసక్తులచేత, ప్రవర్తిల్లుచున్ = ఉన్నవాఁ డగుచు.
సీ. | శోభితాపస్తంబసూత్రు గౌతమగోత్రు | |
ఆ. | బ్రియము సంధిలంగఁ బిలిపించి బహువస్త్ర | 9 |