పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/160

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

మొలచువచఃప్రసంగముల ముందరఁ గాఁగలకార్యరేఖ పెం
పెలయ బరాత్మచింతనసుహృచ్ఛరభంగసుతీక్ష్ణకుంభజా
దులహితశాసనక్రమముతోఁ జరియించెద రత్యనూనత
త్కలితబహూపచారతకతంబున రంజిలి యంచు నెంచుచున్.

34

భారత. ముందర = ఆజ్ఞాతవాసమునకుఁ దరువాత, కాఁగలకార్యరేఖ = యుద్ధ మనుట, పర = పరు లైనదుర్యోధనాదులయొక్కయు, ఆత్మ = తనయొక్కయు, చింతన్ = బలాబలవిచారముచేత, అసుహృత్ = శత్రువులయొక్క, శరభంగమందు, సుతీక్ష్ణ = ప్రచండులైన, కుంభజాదులు = ద్రోణాదులు, అహిత = దుర్యోధనునియొక్క, శాసనక్రమముతో, అత్యనూన = పరిపూర్ణముగా, తత్కలిత = ఆదుర్యోధనకృతమైన, రంజిలి, చరియించెదరు, క్రియ, అంచు, ఎంచుచును.

రామ. ముందరఁ గాఁగల కార్యరేఖ పెంపు, ఎలయన్ = ప్రకాశింపఁగా, పరాత్మచింతన = పరమాత్మధ్యానమునకు, సుహృత్ = బంధువులైన, ధ్యానముతోఁ గూడినవా రనుట, శరభంగ, సుతీక్ష్ణ, కుంభజ, అగస్త్యుఁడు, ఆదుల = మొదలైనవారియొక్క, హితశాసనక్రమముతోన్ = హితోపదేశానుచారమున, రతి = వేడుకచేత, అనూన = అధిక మౌనట్టుగా, తత్కలిత = ఆమునికృతమైన, రంజిలి చరియించెదను.

సీ.

కడుఁ దన్మహాశ్రమగమనోదితోత్సాహుఁ
            డయ్యె నాసమయంబునందు నమిత
తుంగహృద్రిపుశరభంగమునీశ్వరు
            నంబకమున్మహిమాస్పదమును
ఘనతపశ్శక్తిఁ దెమ్మని విధి దయచేసి
            వెస జిష్ణుఁ బంచెఁ దవ్వేళ వచ్చి
తత్పితామహుడు సత్యవిధానుఁ డట్లంప
            నాఘనుఁ డింద్రకీలాశ్రమప్ర


తే.

వేశ మొనరించి యవ్విధివిభుశురేశు
నఖిలనుతుని భజించెద యాత్వరాతి
రాముఁ డాదిత్యకులభర్తరమణ వచ్చి
కరుణ సేయు నంతకుఁ దగుగట్టితాల్మి.

35

రామ. తత్ = ఆశరభంగాదులయొక్క, మహాశ్రమములఁ గూర్చి, గమన = తర్లిపోవుటకు, ఉదిత = పుట్టిన ఉత్సాహము గలవాఁ డాయెను, నమిత, తుంగ = పొడవులైన, హృద్దిపు = అంతశ్శత్రువులు గలవాని, అంబక = నేత్రములకైన, మున్మహిమ = సంతో