| చినవరలాభ మిప్పు డిటు సేసె నిజాత్మ నుపేక్ష మాని నీ | 21 |
రామ. వినుము, ఉదయాభివృద్ధి = అభ్యుదయాభివృద్ధి, మత్ = నాయొక్క, తనయుఁడు ధరయేలురాజు, నాకు, మాపతి = మాయొక్కపతి దశరథుఁడు, అనుగ్రహించిన = ఇచ్చిన, వరలాభము = వరప్రాప్తి, ఇప్పుడు, ఇటు సేసెన్ = రాజ్యము గైకొనునట్టుగాఁ జేసెను, ఆత్మయందు నుపేక్ష మాని, ఆన = తండ్రియాజ్ఞ, హతిసోఁకకయుండఁగఁ జేసి, నీ = నీయొక్క, సునియతి = నియమమును - పుత్త్రధర్మమును, నిల్పుము.
భారత. వినుము, దయాభివృద్ధి, ఇద్ధరయేలురాజు = ధృతరాష్ట్రుఁడు, మత్తనయుఁడు = మత్తునియొక్క నీతివంటినీతి గలవాఁడు - అవివేకి యనుట, నాకు, ఉమాపతి = పరమేశ్వరుఁడు, అనుగ్రహించిన = ఇచ్చిన, వర = పతులయొక్క, లాభము, ఉపేక్ష సేసెనని యన్వయము. మానినీ = మానవతులయొక్క, సునియతి నిల్పు, మానహతి = మానభంగము, సోఁకకయుండఁగా.
ఉ. | ఏకము నీ వెఱుంగనిది యెయ్యెది సర్వవిదుండ వీవు సో | 22 |
భారత. సోత్సేకనిరూఢిన్ = అతిశయయుక్తప్రౌఢిచేత, శ్రీప - సనాతన-సంబుద్ధులు. ఎల్లెడల నుండుదువు, కావునన్ = నను రక్షింపుమా, ఎమ్మెయిన్ = మఱేరూపముననైనను, దిక్కు గానను.
రామ. శ్రీపసన్ = ఐశ్వర్యాతిశయముచేత, నాతనయుండు, ఉదంచిత, ఒరుచొప్పునన్ = అమాత్యాదులరీతిని, కావునన్ = అటుగనుక, కాన = అడవి, దిక్కు, వనవాసమునకుఁ బొమ్మనుట.
సీ. | ఇట్లు పల్కెడునంత హృదయసాహసమున | |