రామ. విహితసన్మంత్రుఁ డగుచున్ = మంచివారితో నాలోచన చేసినవాఁడై, వివేకఘనుఁడైన జనుఁడు, అచ్యుత = జాఱని, విజయముతోడ సంయుతమైన, ప్రహిత = అత్యంతవిహితమైన, భీమ = శత్రుభయంకరమునైన, సేనయొక్క, ఉద్ధతి = ఔద్ధత్యముయొక్క, ప్రవృద్ధిచేత, రిపునేలఁ గల = శత్రువుయొక్క భూమియందుఁ గలిగిన, పెనుసిరులు = అధికసంపదలను, కొనుచు, ఒప్పునని క్రియ.
మ. | స్వనిదేశోన్నతి నంతటన్ నెఱయుచున్ శక్తిం జతుర్దిఙ్నరేం | 15 |
రామ. స్వనిదేశోన్నతిన్ = స్వాజ్ఞామహిమచేత, అంతటన్ = అన్నిచోటులను, చతుర్దిక్కులందుల, గెల్చి, తమ్ము, లసమాన = ఒప్పునట్లుగా, ప్రాప్తమైన = ధర్మార్జితమైన దనుట, విత్త = ధనముయొక్క, అర్పణంబునన్ = దానముచేత, తన్పన్ = తనియింపఁగా, తమ్ముఁ దన్పఁగా ననుట, వశులైన = విధేయులైన, బ్రాహ్మణులతోఁగూడ, రూఢ = ప్రసిద్ధమైన, అపూర్వ = వింతైన, సత్కీర్తితోడ, పృథివీశుఁడు, ఒ ప్పెసగున్, క్రియ.
భారత. అంతటను, తమ్ములు = భీమాదులు, అసమానమౌనట్టుగా, పూర్ణ = ఈడేఱిన, అధ్వర = యాగముయొక్క, ఆరంభము గలఁవాఁడై, సగురు = తండ్రితోఁ గూడునట్లుగా, ఊఢ = వహింపఁబడిన, పృథివీశుఁడు = ధర్మరాజు, ఒప్పెన్ = క్రియ.
ఉ. | క్లిష్టత యించుకంతయును లేక మనఃప్రమదంబుతోడ నా | 16 |
భారత. అయిష్టము = ఆయజ్ఞమును, నిర్వహించి = చేసి, అర్హమైన, భీష్మునియొక్క, సంసిష్టిమెయిన్ = అనుజ్ఞచేత, తుదన్ = యజ్ఞసమాప్తియందు, అసమతేజుఁడవు, ఈవు, అని, చక్రికిన్ = కృష్ణునికి, ఉత్తమపూజ నొనరించెను.
రామ. నాయిష్టము= నాకోరికను, అర్హ = తగుమైన, భీష్మ = భయంకరమైన, సంసిష్టిమెయిన్ = సమ్యగాజ్ఞచేత, అనుత్తమపూజ = అత్యుత్తముపూజను, చెందుదు = పొందుచున్నాఁడవు, చక్రికిన్ = విష్ణువునకు, సమ = సమానమైన, తేజుఁడవు, అని, పల్కి, నడపెనని ముందరిపద్యమునఁ గ్రియ.
తే. | మఱియుఁ దగుమాటలాడి యమర్త్యకార్య | |