పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/146

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“స్వాదుప్రియౌ తుమధురౌ” అని అ. సభా = సభయందుఁగల, జనులయొక్కయు, ప్రధాన = సుమంత్రాదిమంత్రులయొక్కయు, హితోక్తిబృందమునన్ = ప్రియవాక్యము చేతను, అతనిన్ = ఆరాముని, అలరింపుచు, ఇట్లనియె నని ముందరి కన్వయము.

క.

క్రమమున ధరణీభరణ, క్షమ మగుతద్ధర్మనీతి చాతుర్యవిశే
ష మశేష మరసి యధిక, ప్రమదుఁ డయి ప్రసంగవశత రప్పించి తగన్.

5

రామ. తత్ = ఆరామునియొక్క, ధర్మనీతి, ప్రసంగవశతచేత, రప్పించి = రాముని రప్పించి.

భారత. తద్ధర్మ = ఆధర్మరాజుయొక్క, ప్రసంగవశతను రప్పించి = ప్రసంగమును చెప్పించి యనుట.

సీ.

బంధురంజన రామభద్ర ధర్మాత్మజ
            యైశ్వర్యశోభిత యన్వయైక
పావన పాండురాజీవరమాధుర్య
            శోభననయనవసుప్రతాప
నిర్మలప్రౌఢివినీతత్వవిజ్ఞాన
            సౌశీల్యశౌర్యాదిసద్గుణములు
విని యుబ్బుచున్నవాఁ డనుమోదగరిమఁ ద
            త్ప్రేరణఁ జేసి యేఁ దివిరి నిన్నుఁ


తే.

బనిచెద సమస్తమహిరాజ్యపాలనముగ
రంబు నుతి కెక్కఁ జేయుము రాజసూయ
మానచంద్రికాస్ఫూర్తియుఁ బోనికీర్తి
మున్నుగాఁ బర్వి కకుబంతములఁ దలిర్ప.

6

భారత. బంధురంజనముచే, రామ = ఒప్పెడి, భద్ర = శుభములుగలవాఁడా, “స్వశ్రేయసం శివం భద్ర" మ్మని అ. ధరాత్మజ, ఐశ్వర్యశోభిత, పాండురాజు, ఈ = నీయొక్క, వరమాధుర్య, శోభననయ, నవసుప్రతాప, నిర్మలప్రౌఢి, వినీతత్వ, విజ్ఞాన, సౌశీల్య, శౌర్యాదిసద్గుణములు విని యుబ్బుచున్నవాఁడు, అనుమోదగరిముచేత, తత్ = ఆపాండురాజుయొక్క, ప్రేరణఁ జేసి = పనుపుటచేత, రాజ్యపాలనము నుతి కెక్క, ఆన = ఆజ్ఞ, తద్భవపదము, కీర్తిమున్నుగా = కీర్తికంటె ముందరఁగా, తలిర్ప, రాజసూయము చేయుమని యన్వయము.