శ్రీరస్తు
శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః
రాఘవపాండవీయము
తృతీయాశ్వాసము
| 1 |
సదా = ఎల్లప్పుడును, లసత్ = ఒప్పుచున్న, అసదృక్ = సరి లేని, భూమ = మహిమ గలవాఁడా, “పృథ్వాదిభ్యఇమనిచ్ బహోర్లోపోభూచబహోః" అనుసూత్రములచే ఇమనచ్ప్రత్యయముయొక్క యికారమునకు లోపమును బహుశబ్దమునకు భూ అను నాదేశమును.
వ. | అవధరింపు మట్లు రంజిల్లుచున్న యయ్యతీంద్రసామ్రాజ్యధౌరేయుండు. | 2 |
రామ. అతీంద్ర = ఇంద్రుని నతిక్రమించిన, సామ్రాజ్యధౌరేయుండు =దశరథుఁడు.
భారత. యతీంద్రసామ్రాజ్యధౌరేయుండు = మునీశ్వరోత్తముఁడైన నారదుఁడు.
తే. | అతిశుభార్థసంపత్పదంబైనవసుధ | 3 |
వ. | ఇ ట్లనియె. | 4 |
భారత. అతిశుభ = మిక్కి_లియునింపైన, అర్థసంపత్ = భావపుష్టిగల, పదంబై = వాక్యములు గలవాఁడై, నవ = నూతనమైన, సుధ = అమృతముయొక్క, మహిమను, ఏలుచున్ = అతిక్రమించుచును, అతనిన్ = ధర్మరాజును, అలరింపుచును, ప్రియంబగు = ప్రియమైన, సభాజన = సన్మానమే, “ఆనందనసభాజనే” అని అ. ప్రధానముగాఁ గల హితోక్తిబృందముచేతను.
రామ. అతిశుభమైన, ఆర్థసంపత్, ద్రవ్యసమృద్ధికి, పదంబైన = స్థానమైన, వసుధ = భూమిని, ఏలుచు, వాత్సల్య = నెనరుచేతనైన, మధురిమమునన్ = ప్రేమముచేతను,