పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/142

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సార్థమైన, ఉదయంబునన్ = అవతారముచేత, మరుచ్ఛత = దేవతాశతములకును, మఖసంతతులకున్ = యాగసమూహములకును, అతఁడు గదా= ఆవిష్ణువు గదా, దండ = ఆధారము, మును = పూర్వమందు, జయన = జయము, “జయనే జయః" అని అ. ఆదికంబు = ఆదిగాఁ గల, వరమును, హరికిన్ = ఇంద్రునకు, ఇచ్చెను. రఘునాథునిమహిమను వర్ణింప శక్యము గాదనుట.

చ.

అది యటులుండె నట్టిసభయానతశత్రుదయాళుఁ డాజిదీ
వ్యదరిహృదంతవహ్ని సమవర్తిసుతుం డతిలోకభాగ్యసం
పద లమరంగఁ జేకొని శుభస్థితిఁ దమ్ములు దాను నెంతయుం
బొదల శుచిత్వశాలి యజపుత్త్రుడు మిక్కిలి సంతసిల్లుచున్.

115

రామ. సభయ = భయసహితమౌనట్టుగా, ఆనత = నమ్రులైన, శత్రువులందు దయాళుఁడు, ఆజి = యుద్ధమందు, దీవ్యత్ = ప్రకాశింపుచున్న, అరి = శత్రువులయొక్క, హృత్ = హృదయములయందు, అంతవహ్నిసమ = ప్రళయాగ్నికి సమమౌనట్టుగా, వర్తించుచున్నవాఁడు, సుతుండు = రఘునాథుఁడు, అతిలోక = లోకముల నతిక్రమించిన, “అత్యాదయః క్రాంతాద్యర్థే ద్వితీయయా” అని ద్వితీయాసమాసము. భాగ్యసంపదలచేతఁ బొదలఁగా, అజపుత్రుఁడు = దశరథుడు, పెంపొందెనని ముందరిపద్యమునఁ గ్రియ.

భారత. అది యటులుండె, అట్టిసభయందు, ఆనతశత్రుదయాళుఁడు, అంత వహ్ని యయినవాఁడు, సమవర్తిసుతుండు = ధర్మజుఁడు, శుచిత్వ = ధావళ్యముచేత, శాలి = ఒప్పెడివాఁడు, ఆజపుత్త్రుఁడు = బ్రహ్మపుత్త్రుఁడైన నారదుఁడు, చనుదెంచి యని ముందటిపద్యమునకు నన్వయము.

క.

చనుదెంచి సర్వదిగ్వ
ర్తనఁ దేజము మెఱయఁ దత్పురస్థితిఁ బెంపొం
దె నతం డనుజులు దానుం
బొనరించుమహోపచారముల రంజిలుచున్.

116

భారత. సర్వదిగ్వర్తనను దేజము మెఱయగా, తత్ = ఆధర్మజునియొక్క, పురః = అభిముఖమందు, స్థితిన్ = ఉనికిచేత, పెంపొందెను.

రామ. తత్పురస్థితిన్ = ఆపట్టణస్థితిచేత, ఆతండు = రాముఁడు, అనుజులు దానును పొనరించునుపచారములచేత, దశరథుండు, రంజిలుచును పెంపొందెన్ = సుఖమున నుండెను.

శా.

మాహానాథవిహారవాహన కృపామాహాత్మ్యసాహాయ్యకో
త్సాహిశ్లక్ష్ణకటాక్షవిక్షపితభక్తవ్రాతసంసార శ్రీ