పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/139

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాకీశచాపంబునకు నెక్కు డిది గాండి
            వం బనుభారతీవరుధనుర్మ
తల్లికశేషోగ్రతరగుణప్రౌఢి న
            త్యధికంబు క్రమమున నన్యదేవ


తే.

ధృతములైనవానిని గణుతింప నేల
దీని నెక్కడి నీభుజస్థేమఘనవి
జృంభణముఁ జూపు మని తనచేతివిల్లు
దృఢరణస్థితి నరదంబుఁ దెచ్చి యిచ్చె.

110

భారత. కమలేశ = జలాధిపతియైన వరుణునిచేత, దత్తమయ్యెను = ఇవ్వఁబడెను, నాకీశ = దేవేంద్రునియొక్క, చాపంబునకు నెక్కుడు, గాండివంబను = గాండివ మనెడి, ధనుర్మతల్లిక = ధనుశ్రేష్ఠమైనది, “మతల్లికా మచర్చికా ప్రకాండముద్ఘతల్లజౌ ప్రశస్తవాచకాని”అని అ. “శేషునిభంగి నుగ్రతరమైన, గుణ = నారియొక్క, "మౌర్వీ జ్యాశింజినీగుణః” అని అ. ప్రౌఢిచేత నత్యధికంబు, అన్యదేవ = బ్రహ్మాదులచేత, ధృతములైనన్ = ధరించుటలు గలిగినను, వానిన్ = ఆధారణములను, గణుతింపనేల, అని. తన చేతివింటిని, దృఢమైనరణమందుల, స్థితిన్ = ఉనికి గలదాని, అప్రతిహతమైనదాని ననుట, అరదంబును = రథమును, తెచ్చి యిచ్చెను.

రామ. ఆతఁడు = పరశురాముఁడు, జననాథవరకుమారాగ్రణిన్ = దశరథకుమారజ్యేష్ఠుఁ డైనరాముని, చూచి, అనుమాట, నాకు, కమలేశదత్త మయ్యెన్ = ప్రీతిచేత నియ్యఁబడెను. ఈశచావంబునకు నెక్కుడిది, ధనుర్మతల్లికిన్ = ధనుశ్శ్రేష్ఠమునకును, ఆశేషోగ్రతరగుణప్రౌఢిచేత నత్యధికంబు, దృఢరణస్థితి = దృఢమైనరణస్థితి గల, నర = పురుషులను, ద = ఖండించుదాని, “దోఅవఖండనే, అతోనుపసర్గే కః” అని కప్రత్యయాంతము. తనచేతివింటి నిచ్చెను.

మ.

నుతశక్తిన్ నృపసూనుఁ డట్టిధనువున్ మోపెట్టి యైంద్రాయుధో
ద్ధతిపాథోదనిరాసి యయ్యె నపు డాతండు సముద్వేగయు
క్తతఁ గీర్తించి కృతావృథాగ్రహతదస్త్రశ్రామితస్వర్గప
ద్ధతియై యిష్టమహావనీచరతఁ జెందం గాంచి పొంగెన్ మదిన్.

111

రామ. ఐంద్రాయుధోద్ధతిపాథోదనిరాసియయ్యెన్ = ఇంద్రధనుస్సుతోఁ గూడిన యున్నతి గల మేఘమును దిరస్కరించినవాఁ డాయెను. నీలమేఘశ్యాముఁడు గనుక, అతండున్ = పరశురాముఁడును, సముద్వేగయుక్తతన్ = భయయోగముచేత, కృతమైన, అవృథా = వ్యర్థము గాని, గ్రహ = గ్రహణము గల - ఎక్కుఁబెట్టుట గల, తదస్త్ర = ఆరామునిబాణము