పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/134

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగ్నిని బోలినవాఁడు, లక్ష్మణుఁడు, పూజ్య = శ్లాఘ్యమైన, సమిజ్జయ = యుద్ధజయములచేత, శోభి = ఒప్పుచున్న, మన్యున్ = క్రోధము గలవాని, ఆమునిసుతు = పరశురాముని, నే ర్పెనయన్ = చాతుర్యయుక్తముగా, ఉచ్ఛరణప్రగల్భతన్ = ఉచ్చారణశక్తిచేత, ఇ ట్లనునని ముందటిపద్యమునఁ గ్రియ.

తే.

కొసర నిట్లను భావంబు పస నెరపుచు
నమ్మహాత్ముతో జిష్ణుతేజోతిశయము
మిక్కిలిఁ బ్రకాశముగ భాతృమిత్రబంధు
సచివులసమాదృతిని జూపి రుచితసరణి.

101

రామ. జిష్ణు = జయశీలమైన, సమాదృతిన్ = అత్యాదరమున, రుచిత = ఒప్పెడి,సరణిచేత.

భారత. ఇట్లు, అనుభావంబు, అమ్మహాత్ముతోన్ = అభిమన్యునితోఁ గూడి, జిష్ణు = అర్జునునియొక్క, ప్రకాశముగన్ = ప్రకటము కాఁగా, సచివులు, అసమ= అతులమైన, ఆదృతిన్ = ఆదరమును, చూపిరి, ఉచితసరణిన్ = తగినరీతిని.

క.

మగలయిలువరుస గలపెను
దగ వరు లొకఁడొకడొకొక్కతనయు రుచిరశౌ
ర్యగతినుతిఁ జెంద ఘనకీ
ర్తిగ నలరంగలరుద్రోవది వరక్రమతన్.

102

భారత. ఘనకీర్తిగ, అల, రంగలరు = రంగు మీఱు, ద్రోవది = ద్రౌపది, తద్భవపదము. ఉ. 'ద్రోవదిబంధురం బయినక్రొమ్ముడి గ్రమ్మన వీడ్చి వెండ్రుకల్, దావలకేలఁ బూని యసితచ్ఛవిఁ బొల్చు మహాభుజంగియో, నా విలసిల్లి వ్రేలఁగ మనంబునఁ బొంగ విషాదరోషముల్, గావగలేక బాష్పములు గ్రమ్మఁగ దిగ్గున లేచి యార్తయై' అని యుద్యోగపర్వమందుఁ బ్రయోగము. తగ, వరులు = పతులు, రుచిర = ప్రకాశించుచున్న, శౌర్యగతి = శౌర్యవర్తనచేత నైన, నుతి = స్తుతి గలవాని, ఒకొక్క, తనయున్ = కుమారుని, చెందఁగా, పరక్రమతన్ = పెద్దపిన్నవరుసను, లేక, వర = శ్రేష్ఠమైన, క్రమతన్ = మర్యాద గలదౌటచేత, మగలయిలువరుస గలపెను.

రామ. మగలయిలువరుస గల = వంశానుగపౌరుషము గల, పెనుదగవరులు = మంచినేర్పరులు, ఒకఁడొకఁడు = ఒక్కొక్కపురుషుఁడే, ఒకొక్క = ఒకానొకటైన, వింతైన దనుట. ఉరు = అధికమైన, చిర = స్థిరమైన, శౌర్యగతి = శౌర్యవర్తనము, నుతిఁ జెందన్ = ప్రసిద్ధ మగునట్టుగా, అలరంగలరు = ప్రకాశింపఁగలరు, అక్రమతన్ = క్రమము దప్పి, త్రోవదివరు.