జుగుప్సచేతను, పురిన్ = అయోధ్యను, చేరి జనవిసరములకు, యెఱుకపడన్ = కనుపట్టునట్టుగా, దొరయదు = యుక్తము గాదు.
మ. | అనయంబున్ మదనామితాస్త్రకలనాత్యంతార్తి రాకుండఁ జ | 99 |
రామ. మత్ = నాయొక్క, అనామిత = అణఁపఁబడని, అస్త్రకలన = బాణప్రయోగముచేత నైన, అత్యంతార్తి రాకుండ, మౌనిత్వ = నిరుత్తరుత్వముచేత, కృత = చేయఁబడ్డ, ఇష్టసిద్ధితన్ = అభీష్టసిద్ధి గలుగుటచేత, దీప్యమాననిరూఢిచేత, పయిఁబడ్డ = ఆరోపితమైన, ఆ, దవుల = దూరములనున్న, నానావీరధర్మప్రవృత్తి = వార్త, ఆత్మపురికి, పోయెదే = పోయెదవా.
భారత. మదన = మన్మథునియొక్క, అమితమైన, ఆస్త్రకలనా = బాణవిద్యచేత నగు, మౌనిత్వ = మునిత్వముచేత, కృతేష్టసిద్ధితను, సన్న్యాసివేషమున సుభద్రను వరించినవాఁడై యనుట, దేదీప్యమాననిరూఢిం బయిఁబడ్డ, యాదవులయొక్క, దేవేరితోన్ = భార్యతోఁగూడ, పోయెను.
చ. | అనికృతధర్మవీక్షుఁ డయి యావరవర్ణినికామసంభ్రమం | 100 |
భారత. అనికృత = తిరస్కరింపఁబడని, ధర్మవీక్షుఁడయి = ధర్మదృష్టి గలవాఁడై, ఆవరవర్ణిని = సుభద్రయందు, కామసంభ్రమంబు నడపుచును, అమరపూజ్య = దేవతాశ్లాఘనీయమైన, సమిజ్జ = యుద్ధమందుఁ బుట్టిన, యశ = కీర్తి గల, అభిమన్యుఁ డనునామము గలవాని, సుతున్ = పుత్త్రుని, కాంచి, లక్ష్మణుఁడు = లక్ష్మీవంతుఁడు, “లక్ష్మీవాన్ లక్ష్మణః శ్రీలః" అని అ. అముద్రితదీప్తి = అనర్గళమైనదీప్తి గలవాఁడు, ధనంజయుండు = అర్జునుఁడు, నయ = నీతిచేత, గభీరమునై, వీరులచేత, సమపేక్ష్యతర = మిక్కిలి నాశింపఁదగిన, ఉచ్ఛ = ఉన్నతమైన, రణమందుఁగల, ప్రగల్భతన్ = ప్రౌఢిమను, నేర్పెన్ = ఉపదేశించెను.
రామ. అని = ఈలాగునఁ బలికి, కృతమైన, ధర్మవీక్షుఁడయి = వింటియందు దృష్టి గలవాఁడై, వి ల్లెక్కుఁబెట్ట నిశ్చయించినవాఁడై యనుట, ఆవరవర్ణి = ఆనైష్ఠికబ్రహ్మచారి పరశురాముఁడు, “వర్ణినో బ్రహ్మచారిణః" అని అ. నికామ = అత్యంతము, సంభ్రమంబు నడపుచును, కరంబు = మిక్కిలి, అమరఁగా, అముద్రితదీప్తిచేత, ధనంజయుండు =