పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/131

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తదదూరదేశసిద్ధసరసీపుణ్యతీ
            ర్థోపసేవల మహాశాపకలుష


తే.

నైకనిర్జరీధృతమకరీకలాప
రూపలోపకృజ్జలవిహారుఁడును దివ్య
ధామకలితుండు నై శూరతరుఁ డగునరుఁ
డొప్పెసగురుచిరయశోమహోదయతను.

96

భారత. తీర్థయాత్రాసమాప్తిన్ = వత్సరపరిపూర్తిచేత, ఉద్ధవసుధన్ = ఉత్సవామృతముచే, చిత్రాంగద యనెడినామముగల, లతాంగీ = స్త్రీయందు, కృతమైన, సురత = సంభోగముయొక్క ఆవాప్తిచేత, నందన = పుత్త్రుఁడైన బభ్రువాహనునియొక్క, ప్రసవ = పుట్టుకచేత, భూషిత = అలంకరింపఁబడిన, వర్ణినీగురు = చిత్రాంగదాజనకుఁడైన, చిత్ర వాహనుఁ డనెడిరాజు గలవాఁడు, చిత్రాంగదకుఁ బుట్టినవానిఁ జిత్రవాహనునికి నర్జునుం డిచ్చెద నన్నాఁడని యాదిపర్వమందుఁ జెప్పియున్నది గనుక, తత్ = ఆచిత్రవాహనుని పట్టణమునకు, అదూరదేశ = సమీపదేశమందు, సిద్ధమైన = కలిగిన, సరసియొక్క, పుణ్య = మనోహరమైన, తీర్థ = రేవుల, ఉపసేవలన్ = స్నానములచేత, మహాశాపకలుషలైన, నైకనిర్జరీ = అనేకదేవతాస్త్రీలచేత, ధృత = ధరింపఁబడిన, మకరీకలాపరూప = మకరీసమూహదేహములయొక్క, లోపకృత్ = నాశమును జేసినట్టి, జలవిహారము గలవాఁడు, వారిమకరీరూపశాపమోక్షమును జేసి యనుట, దివ్య = మనోహరమైన, ధామ = తేజస్సుతోడ, కలితుండు = కూడినవాఁడు, నరుఁడు = అర్జునుండు, సగురుచిరయశోమహోదయతన్ = ఘనమైన చిరకీర్త్యతిశయముతోడఁ గూడినవాఁ డౌటచేత, ఒప్పెను.

రామ. తీర్థయాత్రకు, సమ = సమానమైన, ఆప్తిన్ = వ్యాప్తిచేత, యుద్ధవసుధ = రణభూమియందు, అతిసరసమగు = మిక్కిలిప్రియమైన, చిత్ర = ఆశ్చర్యమైన, అంగదాన = శరీరచ్ఛేదమువల్ల నైన, “దో అవఖండనే” అను ధాతువున నిష్ఠాంతశబ్ధము. అమలతా = నిష్కల్మషత్వముచేత, అంగీకృతమైన, సురతా = దేవత్వముయొక్క, అవాప్తిఁ జేసి = ప్రాప్తిచేత, శూరతరుఁడైన, నరుఁడు = పురుషుఁడు, నందన = నందనవనముయొక్క, ప్రసవ = పుష్పములచేత, భూషితములునై, వరవర్ణినీ = ఉ త్తమస్త్రీలచేత, గురు = వ్రేఁగైన, చిత్రవాహనుండు = చిత్తరువుతోఁ గూడిన విమానములు గలవాఁడు, తత్ = ఆనందనవనములకు, అదూరదేశ = సమీపదేశమందున్న, సిద్ధసరసీ = ఆకాశగంగయొక్క, మహాశ = ఆధికాశ గలవారైన, అపకలుష, మకరీకలాప = మకరికాపత్రాలంకారముచేతనైన, “ కలాపో భూషణే బర్హే తూణీరే సంహతావపి” అని అ. రూప =