పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/126

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత. సమాతత = విస్తృతమైన, గుణసార్థ = గుణసమూహముయొక్క, “సంఘసార్థౌ” అని అ. సిద్ధిమత్ = సిద్ధిగల, రామ = రమణి ద్రౌపది, మహాఖ్యాతి = అధికఖ్యాతి గలది, పతివ్రత, ఇ ట్లవిఘాతముగ, అనేకభర్తృకత = పెక్కండ్రుభర్తలు గలదౌటను, నడపుట, చేతశ్చిత్రము గాదె.

రామ. సమాతతగుణములచేత, సార్థసిద్ధి = అర్థసిద్ధిసహితమైనది, మత్ = నాయొక్క, రామ = రాముఁ డనెడి, మహత్ = అధికమైన, ఆఖ్యా = నామధేయ మనెడి, అతిపతివ్రత, అనేకభర్తృకతన్ = అనేకభర్తలు గలదౌటను, నడపుట = అసాధారణముగా నాయం దుండెడి రామాఖ్య మఱియొకరియం దుండుట, చిత్రము గాదె.

ఆ.

ఇదియ నాకు మీకు నితరేతరద్వేష
హేతు వనుచుఁ దోఁచె నేకతన్వి
భూతినెరపు నేను బుంవ్యక్తులకు నాలి
తనముతో సమాఖ్య మనుచుటెట్టు.

85

రామ. ఇదియ = ఈరామశబ్దమే, నాకు మీకును ద్వేషహేతు వనుచుఁ దోఁచెను, ఏకతన్ = ముఖ్యత్వమున, విభూతి = ఐశ్వర్యమును, నెరపు నేను, పుంవ్యక్తులకు = పురుషులకు, నాలితనముతోన్ = కొంచెపుతనముతో, సమాఖ్య = సమమైనయాఖ్యను, మనుచుటెట్టు, ఆఁడువారికి రామాఖ్యగాక నాముందటఁ బురుషులకునా యనుట.

భారత. ఇదియ = ఏకపత్నీభోగము, మీ కన్యోన్యవైరమూల మనుచు నాకుఁ దోఁచుచున్నది, ఏకతన్వి = ఏకయైనకాంత, భూతి నెరపు నేనుబుంవ్యక్తులకున్ = ఐశ్వర్యమును నెరపెడియయిదుగురుపురుషులకును, ఆలితనముతోన్ = భార్యయయి, సమాఖ్య మనుచు టెట్టు = కీర్తి చెడకుండ నిర్వహించు టేలాగు.

చ.

భవదుపయామకాలమునఁ బర్వినసుద్దులు విన్నవాఁడ నా
భవువరధర్మ మట్టగుట భావములో నిడి మాకు శంక లె
య్యవి యని యుబ్బు టొప్ప దివి యావరశక్తికి లోనుగా వశ
క్యవిజయముల్ మదీరితమహాశరమణ్యవరుద్ధయుద్ధముల్.

86

ఉపయామకాలమునక్ భారత. భవత్ = మీయొక్క, ఉపయామకాలమున = వివాహసమయమందు, పర్వినసుద్దులు = వ్యాసులు చెప్పిన పంచేంద్రోపాఖ్యానము మొదలయినవార్తలను, విన్నవాఁడను, అభవు= ఆయీశ్వరునియొక్క, వరధర్మము = వరమురీతి, అట్టగుట = అయిదుగురుపతుల నిచ్చుటను, ఇవి = స్త్రీమూలములైన వైరములు, ఆవరశక్తికి = ఈశ్వరవరమాహాత్మ్యమునకు, లోను గావు, జగడాలు పుట్టకుండ వరము లేదనుట, అటు గనుకనే, అశక్యవిజయముల్ = జయింపరానియట్టివి, మత్ = నాచేత, ఈరిత = పలుకఁబడిన, సుందోపసుందోపాఖ్యాన మనుట, మహాశ = అధికసురతాపేక్షగల, రమణీ = స్త్రీలచేత,