చెప్పనవసరము లేదు. ఒక్కరచనాసామ్యము కాలనిర్ణయవిచారమునఁ బరమప్రమాణము కాఁజాలదు. వీరిసిద్ధాంతము సరియే కాని వీరు చూపిన ప్రమాణములు ప్రబలములు గావు. ప్రకాశవర్షుఁడు భోజునికిఁ బరుఁ డనుటకు నొండురెం డాంతరప్రమాణములు లభించుచున్నవి. వీని నేలకో పైపండితు లలక్ష్యము చేసిరి. ఇది చింత్యము. 'సరస్వతీకంఠాభరణము'న భోజుఁడు పదదోషప్రకరణమున - 'అసాధు’వను దోషము నిట్లు వివరించెను.
"శ్లో. | 'శబ్దశాస్త్రవిరుద్ధం య త్త దసాధు ప్రదక్షతే | |
'శ్లో. | భూరిభారభరాక్రాన్త బాధతి స్కన్ధ ఏష తే | |
అత్ర బాధతే రాత్మనేపదిత్వాద్ 'బాధతే' ఇతి స్యాత్, న పునర్ 'బాధతి' ఇతి." [I గుణవివేచనపరిచ్ఛేదము; 4 పుట. నిర్ణయసాగరముద్రణము. 1934.] దీనికి రత్నేశ్వరుఁ డిట్లు వ్యాఖ్య వ్రాసియున్నాఁడు: “అత్ర కేచి దాహుః-‘బాధతిధాతుం సంస్కారప్రచ్యావనేన బాధతే ఇతి బాధతిబాధస్తస్య సంబోధనం బాధతిబాధేతి. తే=తవ. వచన మితి శేషః,' ఇతి. త దసత్. నేయార్థత్వప్రసఙ్గాత్. అన్యేతు 'బాధతి ర్బాధతే యథా' ఇతి పఠన్తి. ఇదం తత్త్వమ్. విద్యమాన స్వార్థవత్వ స్యావివక్షాయాం గవిత్యయమాహేత్యాదావివ ప్రాతిపదికసంజ్ఞా న ప్రవర్తతే.”
'భూరిభార' అను పైశ్లోకమును శబ్దశాస్త్రవిరుద్ధ మగునసాధుదోషమున కుదాహరణముగా భోజుఁడు చూపియుండ నందలి యుత్తరార్ధమును స్వీకరించి ప్రకాశవర్షుఁడు భోజుఁడు దోష మనిన దాని కపవాదము నిట్టులు నిపుణముగాఁ జూపియున్నాఁడు: [శబ్ద మసాధు వైనను ననుకరణమున గుణీభావము నందును.]
శ్లో. | 'పదం యాతి గుణీభావ మనుకర్తు రసా ధ్వపి | |
2 పరి. 36-37 శ్లో. [7 పు.]