యలు మొదలగు ననేకు లుత్తమాలంకారికులే కాక తమకావ్యనిర్మాణపాటవముచేతను బ్రసిద్ధు లైయున్నారు. నామైక్యముండి, విరోధిప్రమాణము లేనప్పుడు వ్యక్తిద్వయకల్పన మసంగతము. కావునఁ బైనలువురు నొకఁడే—
కాని వీరిసిద్ధాంతముకంటె వేంకటరామశర్మగారి యభిప్రాయమే సరి యని తోఁచెడిని. మాఘభారవికావ్యవ్యాఖ్యాత లిరువురు నొకఁడే యనియు, నీతఁడు భోజునికంటెఁ [క్రీ. 1005-1054] బ్రాక్తనుఁ డనియు, భోజునికంటె మనయాలంకారికుఁడు భిన్నుఁ డనియు, బరుఁ డనియుఁ దోఁచుచున్నది. సుభాషితావళిలోఁ బేర్కొనఁబడిన ప్రకాశవర్షుఁడు పైవ్యాఖ్యాతయే కావచ్చును, లేక ప్రకృతగ్రంథకర్త యైనను గావచ్చును. వ్యాఖ్యాత యగుప్రకాశవర్షుని, యాలంకారికుఁ డగుప్రకాశవర్షుని పౌర్వాపర్యవిచారము క్రింది కాలనిర్ణయప్రకరణమునఁ గననగును.
4. ప్రకాశవర్షుని కాలము
భామహుని 'కావ్యాలంకారము'నను, దండి 'కావ్యాదర్శము'నను ప్రకాశవర్షుని 'రసార్ణవాలంకారము'నుండి పదవాక్యవాక్యార్ధము లనేకములు హరింపఁబడిన వనియు, ప్రకాశవర్షునికృతి దండిభామహులకృతుల కుపజీవ్య మనియు నందువలన వీరిరువురును ప్రకాశవర్షునికంటె నవీను లనియు, భట్టబాణుని బేర్కొనుట చేఁ బ్రకాశవర్షుఁడు బాణునికంటె నర్వాచీనుఁ డనియు నందుచే మనకవి బాణుని తరువాతను దండిభామహులకుఁ బూర్వమునను [అనఁగా - క్రీ. శ. 650-750 నడుమ] జీవించియుండవలె ననియు వేంకటరామశర్మగారి సిద్ధాంతము.[1] కాని యిది యవిమర్శపూర్వకము. సుశీలకుమారడే, రాఘవన్ పండితుల వ్యాసములను బట్టి ప్రకాశవర్షుఁడు భోజునికంటె నవీనుఁ డనియు, భోజుని 'సరస్వతీకంఠాభరణము', 'శృంగారప్రకాశము'ను ప్రకాశవరుని కృతిలత కుపఘ్నము లనియు సుశీలకుమారడే, రాఘవన్ పండితు లనేకరచనాసామ్యప్రదర్శనపూర్వకముగా నిర్ధారణ చేసియున్నారు. వీరిమతమును బట్టి దండి-భామహ–బాణులకంటె ప్రకాశవర్షుఁడు నవీనుఁ డని వేఱె
- ↑ Introduction to 'Rasarnava'—P. X.