వల్లభదేవుని పౌత్రుఁ డగుకైయటుఁడు క్రీ.శ. 977 లో నానందవర్ధనుని 'దేవీశతకము'నకు వ్యాఖ్యను రచించెను. ఆవ్యాఖ్యనుండి యీప్రమాణమును జూచునది.[1]
శ్లో. | ‘వల్లభదేవాయనిత శ్చన్ద్రాదిత్యా దవాప్య జన్మేమామ్ | |
శ్లో. | వసుమునిగగనోదధి [4078] సమకాలే యాతే కలే స్తథా లోకే | |
కైయటుఁడు క్రీ. శ. 977 ప్రాంతముల జీవించియుండుటచే నాతనిపితామహుఁ డగు వల్లభదేవుఁడు క్రీ. శ. 927 ప్రాంతముల జీవించియుండె నని నిశ్చయింపనగును. కావున వల్లభదేవుని విద్యాగురు వగు ప్రకాశవర్షుఁడు క్రీ.శ. 875-925 నడుమ విలసిల్లియుండవచ్చు నని నందకిశోరశర్మగారు వ్రాసియున్నారు.
4. రసార్ణవాలంకారకర్త యగు ప్రకాశవర్షుఁడు.
ఈనలుగురును భిన్నులా, కారా యనునది విమర్శనీయము. మాఘభారవుల కావ్యములకు వ్యాఖ్య వ్రాసి, సుభాషితావళి మొదలగు సంధానగ్రంథములలోఁ బేర్కొనఁబడిన ప్రకాశవర్షుఁడు కవి యనియు, నందువలన నాలంకారికుఁ డగు మనగ్రంథకర్తకంటె భిన్నుఁ డనియు వేంకటరామశర్మగారు వ్రాసియున్నారు.[2] భిన్నవాదమున కింతకంటెఁ బ్రబలప్రమాణము నేమియుఁ జూపక సిద్ధాంతీకరించుట చింత్య మనుచు వీరియభిప్రాయమును ఖండించుచు పండిత నందకిశోరశర్మగా డిట్లు నుడివియున్నారు;[3]
—కవి యగువాఁ డాలంకారికుఁడు కాఁ డనుట యపసిద్ధాంతము. కవి యైనవాఁడే యాలంకారికుఁ డగుటకు నిదర్శనము లనేకములు గలవు. దండి, భోజుఁడు, 'సాహిత్యదర్పణ' నిర్మాత యగువిశ్వనాథుఁడు 'రసగంగాధర'కారుఁ డగు జగన్నాథపండితరా