పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[క్రీ. 1363] నుదాహరింపఁబడియుండుటచే నీప్రకాశవర్షుఁడు క్రీ. 1363కంటెఁ బూర్వుఁ డని చెప్పఁదగును.

2. భారవికృత 'కిరాతార్జునీయము' నకు వ్యాఖ్యాత.

ఈప్రకాశవర్షుని, దద్వ్యాఖ్యను దేవరాజయజ్వ తనభారవివ్యాఖ్య ('సుబోధిని') యందును,[1] గదసింహుఁడును[2] [క్రీ. 1200-1600] మల్లినాథుఁడును దమ ‘కిరాతార్జునీయవ్యాఖ్యల'లో [IV స. 10 శ్లో.)ను బేర్కొనియున్నారు.

3. మాఘకృత 'శిశుపాలవధ'కు వ్యాఖ్యాత.

ఈప్రకాశవర్షుని వల్లభదేవుఁడు స్వకృతమాఘవ్యాఖ్యలోఁ దనకు గురువుగాఁ బేర్కొనియున్నాఁడు. ప్రకాశవర్షునకు మహోపాధ్యాయబిరుద మున్నటు లీతనియాకరమువలనఁ దెలియుచున్నది.[3] ఈగురుశిష్యులు సమకాలికులు గావున వల్లభదేవునికాలము నిట విచారింపఁజనును. ఈతఁడు 'సుభాషితావళి'సంధాత యగువల్లభదేవునికంటెఁ బ్రాచీనుఁడు, భిన్నుఁడు నని యెఱుఁగునది.]

  1. 'ప్రకాశవర్షప్రభృతిప్రణీతా, వ్యాఖ్యా న పూర్ణా ఇతి భారవీయే
    కావ్యే ప్రభూతాం విదధాతి టీకాం, శ్రీదేవరాజో విదుషాం నిదేశాత్.'
    i. 'Triennial Catalogue of MSS.' of the Govt. Oriental Manuscripts Library-(Madras)-Vol. II. Part 1. C. (No. 1854 d)
    ii. ‘Ibid—Vol. IV.' Part 1. (No 2912)
    iii. Travancore' Catalogue'-P. 97. [Cantos I-IX & XV]. 1895.

  2. 'సన్తి ప్రకాశవర్షాది టీకా ఆపి సువిస్తరాః
    తథాపి లఘుబోధార్థం గదసింహో౽కరో దిమామ్'

    'సంస్కృతకవిపరిచయము- భారవి' - పు. 47

  3. (అ) ‘శ్రుత్వా ప్రకాశవర్షాత్తు వ్యాఖ్యాతం తావ దీదృశమ్
    విశేషతస్తు నైవాస్తి బోధో౽త్రానుభవా దృతే.'— చతుర్థసర్గటీకా
    (అ.) "అత్ర మహోపాధ్యాయః ప్రకాశవర్షః—
    'షష్ఠీ సమాసో౽ప్యత్ర బహువ్రీహ్యర్థే౽న్తర్భవ త్యేవ. యోహి యస్య
    సఖా తస్యాసావపి భవత్యేవ.' ఏవ మత్రాపి — 20 సర్గె 71 శ్లోకటీకా.