కృతము విశేషముగా నుపకరించినవి. మఱియు 'డే' పండితుని 'అలంకారశాస్త్రచరిత్ర'[1], పాండురంగ వామన కాణేపండితుని 'అలంకారశాస్త్రచరిత్ర'[2], ప్రకృతము ముద్రణమునందున్న డాక్టర్ మాడభూషి కృష్ణమాచార్యుల వారి 'సంసృతసారస్వతచరిత్రము'[3] నా కుపకారకములయినవి. పాఠకులకు సుబోధముగా నుండుటకై శ్లోకముల ప్రక్క నాయాశ్లోకములందలి విషయములఁ దెలుపుసూచికలను జేర్చియున్నాఁడను. విజయనగరమహారాజసంస్కృతకళాశాలలోని 'రసార్ణవాలంకారము'యొక్క వ్రాతప్రతియందలి పాఠభేదము లనుబంధమునఁ జూపఁబడినవి.
3. ప్రకాశవర్షులు
సంసృతవాఙ్మయమునఁ బ్రకాశవర్షుఁ డనునామముతో నలుగురు గ్రంథకర్తలు కన్పట్టుచున్నారు.
1. వల్లభదేవుని 'సుభాషితావళి'[4]లోను, శార్ఙ్గధరుని 'శార్ఙధరపద్ధతి'[5] లోను నుదాహరింపఁబడిన ప్రకాశవర్షుఁడు. ఈతఁడు కాశ్మీరదేశస్థుఁ డనియు, భట్టహర్షుని సుతుఁ డనియు, 'సుభాషితావళి'లో నుదాహరింపఁబడిన దర్శనీయకవి (=దోర్లతికాదర్శనీయకవి?)కి జనకుఁ డనియు, గౌడకవి భట్టనరసింహకవిపుత్త్రునికి శిష్యుఁ డనియు నందకిశోరపండితులు వ్రాసియున్నారు[6]. వల్లభదేవ [క్రీ. 1417-67] శార్ఙ్గధరులచే
- ↑ 'Studies in the History of Sanskrit Poetics' Vol. I (1923) By Dr. S. K. De, M. A., D. Lit.
- ↑ 'History of Alamkara Literature' - By Prof. P. V. Kane, M. A., LL. M. (1923.)
- ↑ ‘History of Classical Sanskrit Literature' Second, revised and enlarged edition (now in course of publication)- By Dr. M. Krishnamachariar, M. A., M. L., PH. D., M. R. A. S.
- ↑ Edited in the 'Bombay Sanskrit & Prakrit Series' By Prof. Dr. P. Peterson. (1886).
- ↑ Edited : in the 'Bombay Sanskrit & Prakrit Series' By Dr. Peterson. (1888).
- ↑ సంస్కృతకవిపరిచయము - పు. 20.