పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంధము నెఱుఁగని యాంధ్రదేశసంస్కృతపండితుల కీకృతి యన నచుంబితప్రక్రియగా నుండు నని యెంచి దీనిని దెలుఁగు లిపిలో విపులసమాలోచనపూర్వకముగా రసజ్ఞలోకమునకు నివేదించుచున్నాఁడను. శర్మగా రీకృతిని బ్రచురించిన కొన్నినెలలకే -ఆచార్య సుశీలకుమార - డే-గారు[1] [డక్కావిశ్వవిద్యాలయమున గీర్వాణపీఠాధ్యక్షులు] శర్మగారిపీఠికలోని యనేకసిద్ధాంతముల ఖండించుచుఁ బైకలకత్తాపత్రిక[2]లోనే యొకవ్యాసమును బ్రకటించియున్నారు. 'డే'పండితు లిప్పటికి రెండుసంవత్సరములకుఁ బూర్వమే 'లండన్' నగరమునుండి వెలువడు 'ప్రాచ్యవిద్యాలయపత్త్రిక'[3]లోఁ బ్రకృతగ్రంథమును గూర్చి యించుక వ్రాసియున్నారు. ఈనడుమ చెన్నపురవిశ్వవిద్యాలయమున గీర్వాణశాఖలోఁ బరిశోధకులుగానుండిన ఆచార్య వి. రాఘవన్ పండితులు కూడ శర్మగారిసిద్ధాంతములను నిరసించుచు చెన్నపురిలోఁ బ్రకటింపఁబడు 'ప్రాచ్యపరిశోధనపత్త్రిక'[4]లో [1934] నొకవ్యాసమును బ్రచురించియున్నారు. సాహిత్యాచార్య, వేదాంతభూషణ నందకిశోరశర్మ యనుకాశీపండితులు ప్రాచ్యవిద్యావైభవ - మహామహోపాధ్యాయ, గోపీనాథకవిరాజ [యం.ఏ] మహోదయుని సంపాదకత్వమున 'సారస్వతాలోకము'నందలి ప్రథమకిరణమున కనుబంధముగా 'సంసృతకవిపరిచయము - భారవి'[5] యను కృతిని [1932] బ్రకటించియున్నారు. పైవ్యాసములు, కృతులును బ్ర

  1. Dr. S. K. De, M. A., D. Lit., Head of the Department of Samskrit & Bengali, Dacca University.
  2. 'Indian Historical Quarterly' Vol. V. No. 4. December, 1929. (Pp. 770-80).
  3. 'Bulletin of the School of Oriental Studies'-Vol. IV. Part ii, P. 283.
  4. 'Journal of Oriental Research' Vol. VIII. Part 3. Pp. 267–76 (1931).
  5. 'The Sarasvataloka' Kirana I (Supplement): 'సంస్కృతకవిపరిచయః -మహాకవి భారవిః’-నిబన్ధకః: సాహిత్యాచార్య శ్రీనందకిశోరశర్మా. [Benares, 1932.]