పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ననుభవించుటకు సాధనభూత మైనది. కావున 'అహంకారశృంగారాభిమాన' మొకటియే రసము. 'సరస్వతీకంఠాభరణము'నఁ గూడ రసప్రకరణము మొదట [5 పరి.] నీతని సిద్ధాంత మిట్లు సూత్రప్రాయముగా నొసఁగఁబడెను:

'రసో౽భిమానో౽హఙ్కారః శృఙ్గార ఇతి గీయతే.'

ఈనవీనమతము నావిష్కరించిన పిమ్మట భోజుఁడు ప్రాచీనాలంకారికులు చెప్పిన 'శృంగారము' [స్త్రీపురుషప్రేమ] రతియను భావముయొక ప్రకర్షావస్థయే యని నుడివియున్నాఁడు. ఈరతి 'అహంకారశృంగార'కల్పకముయొక్క ప్రథమముఁ బ్రధానము నగునంకురము. 'శృంగారప్రకాశము' [11ప్రకాశ] న నీరతినే 'సకలభావమూర్థాభిషిక్త' మని యీతఁడు చెప్పియున్నాఁడు. రతిప్రపంచక మగు 13 వ ప్రకాశము తుదిని—

1. శ్లో.

'సైష భావో రతి ర్నామ.'


2. శ్లో.

‘భావాన్తరేభ్యః సర్వేభ్యః'


3. శ్లో.

'నిసర్గసంసర్గసుఖైః ప్రభేదైః.'

అనునీశ్లోకములలో రతివిచారము నుపసంహరించెను. ఈశ్లోకములు మూఁడును రసార్ణవమున స్వీకరింపఁబడినవి. [5 పరి. 12-14]

'రసార్ణవము'న నీప్రకరణమున 'శృంగారప్రకాశము' సారము- అందుఁ బ్రధానముగా 11, 12, 13 ప్రకాశముల సారము-సంగ్రహింపఁబడి యుండును, రసార్ణవమునఁ బంచమప్రకరణము—

'ఉక్తః సో౽యం విభావానుభావసఞ్చారిసఙ్కరః
క్రమేణ సర్వభావానాం శృఙ్గారేషు చతుర్ష్వపి.'

అని ప్రారంభింపఁబడెను. దీనినిబట్టి మొదటఁ జాలభాగ ముత్సన్నమైనట్లు తెలియుచున్నది. ఇటఁ బేర్కొనఁబడిన చతుర్విధశృంగారములును భోజుఁడు చెప్పిన ధర్మార్థకామమోక్షశృంగారములే. శ్లోకాదిని 'ఉక్తః' అని చెప్పఁబడుటచే లుప్త మగుభాగమున 'శృంగారప్రకాశము' నందలి 11, 13, 14, 18-21 ప్రకాశములలో వివరింపఁబడిన