పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/13

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
1. శబ్దగుణములు 3:-(అ) శ్లేష. (ఆ) సమత. (ఇ) సుకుమారత.
2. అర్థగుణములు 3 :- (అ) అర్థవ్యక్తి. (ఆ) ప్రసాదము. (ఇ) కాంతి.
3. ఉభయగుణములు 4 :- (అ) ఓజస్సు. (ఆ) మాధుర్యము. (ఇ) ఔదార్యము. (ఈ) సమాధి.

పై వాక్యదోషములలోని'శ్లేషాదిగుణహీనము నందలి 'ఆది' పదముచే నీ 10 గుణములయొక్క యభావమే 10 దోషములుగా నెంచఁబడెను. ఈదోషము లేవన-

1. శ్లేషవిపర్యయము.
2. సామ్యవిపర్యయము.
3. సౌకుమార్యవిపర్యయము.
4. అర్థవ్యక్తివిపర్యయము.
5. ప్రసాదవిపర్యయము.
6. కాంతివిపర్యయము.
7. ప్రౌఢివిపర్యయము.
8. మాధుర్యవిపర్యయము.
9. ఔదార్యవిపర్యయము.
10. నిస్సమాధి.

వాక్యార్థదోషములు 16 :-

1. అపార్థము.
2. వ్యర్థము.
3. ఏకార్థము.
4. ససంశయము.
5. అపక్రమము.
6. ఖిన్నము.
7. అతిమాత్రము.
8. విరసము.
9. పరుషము.
10. హీనోపమ.
11. అధికోపమ.
12. విసదృశోపమ.
13. అప్రసిద్ధోపమ.
14. నిరలంకారము.
15. అశ్లీలము.
16. విరుద్ధము.

ఇందలి విరుద్ధదోషము 3 విధములు.

1. ప్రత్యక్షవిరుద్ధము. [3 విధములు.]

1. దేశవిరుద్ధము.
2. కాలవిరుద్ధము.
3. లోకవిరుద్ధము.

2. అనుమానవిరుద్ధము. [3 విధములు.]

1. యుక్తివిరుద్ధము.
2. ఔచిత్యవిరుద్దము.
3. కామశాస్త్రవిరుద్ధము.

3. ఆగమవిరుద్ధము.