పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ను, 'డే' పండితులును నుడివియున్నవారు. కాని దీనిని గూలంకషముగ గవేషణ మొనర్చిన రాఘవన్ పండితు లిది యాఱుప్రకరణముల గ్రంథ మై యుండవలె ననియు, నుభయాలంకారవిచారక మగు పంచమప్రకరణము పూర్తిగాను, రసప్రకరణమగు నాఱవప్రకరణము [ముద్రితపుస్తకమున 5 వ పరిచ్ఛేదము.] చాలవఱకును లోపించియుండవలె ననియు నిర్ణయించియున్నారు. అందులకు వారు చూపిన యుపపత్తుల[1] నిటఁ జూపుచున్నాను—

1. పరిచ్ఛేదము దోషప్రకరణము. 2. పరి. గుణప్రకరణము. 3-4. పరి. శబ్దార్థాలంకారప్రకరణములు. 5. పరి. శృంగారవ్యక్తి యనఁబడు రసప్రకరణము. ఇందు 2పుటలగ్రంథము మాత్రము లభించినది. మనకు లభించినస్వల్పగ్రంథమునుబట్టి చూచినను శృంగారప్రకాశమున భోజుఁడు విపులముగాఁ జేసిన రసవిచారమును ప్రకాశవర్షుఁ డీప్రకరణమున సంగ్రహముగా నుడివి యుండె నని తోఁపకమానదు. అందువలన నీపరిచ్ఛేదము తకినవానికంటే మిగుల విపులముగా నుండితీరవలెను.

తృతీయపరిచ్ఛేదముమొదట నలంకారములు— బాహ్యములు, అభ్యంతరములు, బాహ్యాభ్యంతరములు నని మూఁడువిధము లని మనకవి పేర్కొనియున్నాఁడు. ఈయలంకారవిభజనము నీతఁడు భోజునినుండియే గ్రహించియున్నాఁడు. భోజుఁ డీమూఁడువిధము లగు నలంకారములను ద్రివిధము లగు స్త్రీలయలంకారములతోఁ బోల్చియుండ మనకవియు నట్లే నుడివియుండెను. చూడుఁడు: శృంగారప్రకాశము [చెన్నపురిలోని వ్రాఁతప్రతి II సం. 266 పు.]

అలఙ్కారాశ్చ త్రిధా—బాహ్యాః, అభ్యన్తరాః, బాహ్యాభ్యన్తరాశ్చ. తేషు బాహ్యాః వస్త్రమాల్యవిభూషణాదయః; అభ్యన్తరాః దన్తపరికర్మ-నఖచ్ఛేదా-లకపరికల్పనాదయః; బాహ్యాభ్యన్తరాః స్నానధూప(విలేపనాదయః).

చూ. రసార్ణవము [3 పరి. 5-8 శ్లో. 12 పు.]

అఁదువలన ప్రకాశవర్షుఁ డీమూఁడువిధము లగునలంకారములను గూర్చియుఁ జర్చించి యుండు నని నొక్కి వక్కాణింపవచ్చును. కాని మనకు లభించిన వ్రాతప్రతిలో (3 వ పరి.) బాహ్యము లగు శబ్దాలం

  1. 'Journal of Oriental Research' Vol. VIII. Part 3. P. 268-9.